Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాష్ట్రపతి పాలన విధించాలని కోరడానికి కారణం ఇదే: చంద్రబాబు!

 

రాష్ట్రపతి పాలన విధించాలని కోరడానికి కారణం ఇదే: చంద్రబాబు!

  • ప్రజలు, దేవాలయాలు, ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయి
  • కాపాడటం చేతకాకపోతే పోలీసు వ్యవస్థను మూసేయండి
  • జగన్ క్యారక్టర్ లోనే లోపం ఉంది

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని టీడీపీ ఎప్పుడూ కోరలేదని… కానీ, ప్రస్తుతం ప్రజలు, దేవాలయాలు, పార్టీ కార్యాలయాలు, ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని… అందుకే రాష్ట్రపతి పాలన విధించాలని కోరామని చంద్రబాబు అన్నారు. పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులను నిరసిస్తూ ఆయన దీక్షను చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ ఆఫీసులోకి చొరబడి దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే… తిరిగి ఎదురు కేసులు పెట్టారని మండిపడ్డారు. దాడికి పాల్పడిన వారితోనే ఎదురు కేసులు పెట్టించిన డీజీపీకి హ్యాట్సాఫ్ చెప్పాలా? అని దుయ్యబట్టారు. శాంతిభద్రతలకు కాపాడటం చేతకాకపోతే పోలీసు వ్యవస్థను మూసేయాలని అన్నారు.

పట్టాభి మాట్లాడిన దాంట్లో తప్పులేదని… జగన్, వైసీపీ మంత్రులు, నేతలు వాడిన భాషపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ప్రజా వ్యతిరేక విధానాలపైనే తాము పోరాడుతున్నామని చెప్పారు. ఇప్పటి వరకు తన మంచితనాన్ని, టీడీపీ మంచితనాన్ని మాత్రమే చూశారని… భవిష్యత్తులో తామేంటే చూస్తారని అన్నారు.

ముఖ్యమంత్రి జగన్ క్యారెక్టర్ లోనే లోపం ఉందని ఎద్దేవా చేశారు. ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని చెప్పారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఎన్టీఆర్ భవన్, తెలుగుదేశం పార్టీ నిలయమని అన్నారు. తమ అనుమతి లేకుండా తమ కార్యాలయంలోకి ఎలా ప్రవేశిస్తారని ప్రశ్నించారు. మీ ఇంట్లోకి మీ పర్మిషన్ లేకుండా వస్తే ఒప్పుకుంటారా? అని నిలదీశారు.

 

Related posts

రాజీనామా చేసి దళితుడికి ముఖ్యమంత్రి ఇవ్వు …కేసీఆర్ కు షబ్బీర్ అలీ సలహా!

Drukpadam

సాగర్ సమరం లో పార్టీల ఎత్తులు పై ఎత్తులు…

Drukpadam

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక బూటకం: కేజ్రీవాల్….

Drukpadam

Leave a Comment