Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీ గవర్నర్ ను కలిసిన టీడీపీ ప్రతినిధుల బృందం…

ఏపీ గవర్నర్ ను కలిసిన టీడీపీ ప్రతినిధుల బృందం…
-పట్టాభి వ్యాఖ్యల నేపథ్యంలో దాడి ఘటనలు
-గవర్నర్ వద్దకు వెళ్లిన అచ్చెన్న, యనమల, వర్ల తదితరులు
-గవర్నర్ కు ఫిర్యాదు
-రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్
-వైసీపీపై చర్యలు తీసుకోవాలంటూ వినతి
-మా ఫిర్యాదు పట్ల గవర్నర్ సానుకూలంగా స్పందించారు: అచ్చెన్నాయుడు

టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి, పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటి వద్ద విధ్వంసం తదితర పరిణామాల నేపథ్యంలో, టీడీపీ ప్రతినిధుల బృందం ఈ సాయంత్రం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసింది. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, రామానాయుడు విజయవాడలో రాజ్ భవన్ కు విచ్చేసి గవర్నర్ తో భేటీ అయ్యారు.

మంగళగిరిలో టీడీపీ ప్రధాన కార్యాలయంపైనా, తమ నేతలపైనా దాడులు చేశారంటూ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. వైసీపీపై చర్యలు తీసుకోవాలంటూ ఆయనకు వినతిపత్రం సమర్పించారు. దాడులపై వీడియో ఫుటేజిని కూడా గవర్నర్ కు అందజేశారు. రాష్ట్రంలో 356 ఆర్టికల్ విధించాలని, దాడి ఘటనలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.

గవర్నర్ సానుకూలంగా స్పందించారు. ..అచ్చన్న

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ ముగిసిన అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియాకు వివరాలు తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి గురించి గవర్నర్ కు తెలిపామని వెల్లడించారు. గవర్నర్ ముందు పలు డిమాండ్లు ఉంచామని వివరించారు. తమ ఫిర్యాదు పట్ల గవర్నర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. దాడుల అంశాన్ని రాష్ట్రపతి, కేంద్రం దృష్టికి కూడా తీసుకెళతామని అచ్చెన్నాయుడు అన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, రాష్ట్రంలో ఆర్టికల్ 356 విధించాలని డిమాండ్ చేశారు. తమపైనే దాడిచేసి, తమపైనే కేసులు పెట్టారని ఆరోపించారు. లోకేశ్ పైనా, ఇతర నేతలపైనా తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక అసమర్థ డీజీపీ ఉన్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Related posts

కాంగ్రెస్‌పై బీజేపీ సీఎం అదిరేటి సెటైర్లు!

Drukpadam

కండోమ్స్ ఎక్కువ‌గా వాడేది ముస్లింలే: ఎంపీ అస‌దుద్దీన్!

Drukpadam

మోడీ ప్రధాని పదవిని దిగజార్చారు: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజం!

Drukpadam

Leave a Comment