Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

చంద్రబాబు దీక్షలో జగన్ పై అగ్గిమీద గుగ్గిలం …

చంద్రబాబు దీక్షలో జగన్ పై అగ్గిమీద గుగ్గిలం …

-వీరుడ్ని, శూరుడ్ని అని చెప్పుకోవడం కాదు… డైరెక్ట్ గా తేల్చుకుందాం!: సీఎం జగన్ కు కేశినేని నాని సవాల్!

  • -టీడీపీ ఆఫీసులో చంద్రబాబు దీక్ష
  • -మద్దతు ప్రకటించిన ఎంపీ కేశినేని నాని
  • -సీఎం జగన్ పై విమర్శలు
  • -దొంగచాటు దాడులు చేస్తారా? అంటూ ఆగ్రహం

 

తెలుగుదేశం కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తల దాడులను నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రభాను నాయుడు చేపట్టిన 36 గంటల దేశంలో భాగంగా రెండవరోజు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ , టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు . ఎంపీ లు రాంమోహన్ నాయుడు , కేశినేని నాని , ఎమ్మెల్యేలు రామానాయుడు , చినరాజప్ప , ఎమ్మెల్సీలు యనమల రామకృష్ణడు , బోండా ఉమా , దేవినేని ఉమా , తదితర నాయకులు పాల్గొని మాట్లాడుతూ , ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. రా తెచుకుందారం రా ? చంద్రబాబు చిటికేస్తే ఒక్క క్షణం పట్టదు అంటూ మండి పడ్డారు. పిరికి పంద లాగా వ్యవహరించడం కాదు దమ్ము దైర్యం ఉంటె బయటకు రావాలని సవాల్ విసిరారు. 2024 మాదే అధికారం చంద్రబాబే సీఎం , అప్పడు చూసుకుంటాం అంటూ పోలీసులను సైతం హెచ్చరించారు. బోండా ఉమా , ఎంపీ కేశినేని నానీలు మరో అడుగు ముందుకేసి పిరికి పంద చర్యలను మానుకోకపోతే ప్రజాగ్రహానికి గురికాకతప్పదన్నారు.

మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చేపట్టిన దీక్షకు ఎంపీ కేశినేని నాని మద్దతు ప్రకటించారు. నేడు పార్టీ ఆఫీసుకు వచ్చిన నాని మాట్లాడుతూ, సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ రాక్షస పాలన ఎలాంటిదో యావత్ ప్రపంచానికి చాటేలా ఇటీవల పరిస్థితులు ఉన్నాయని అన్నారు. రౌడీయిజం అనేది పిరికిపంద చర్య అని పేర్కొన్నారు.

“ఎవరూ లేని సమయంలో దొంగచాటుగా వచ్చి టీడీపీ ఆఫీసులు ధ్వంసం చేస్తారా?… వీరుడ్ని శూరుడ్ని అని చెప్పుకోవడం కాదు… విజయవాడలో ఏ గ్రౌండ్ కి వస్తారో చెప్పండి, డైరెక్ట్ గా తేల్చుకుందాం!” అంటూ సీఎం జగన్ కు సవాల్ విసిరారు.

“2019లో ప్రజలు ఒక్క చాన్స్ అనుకున్నారో, లేక నీ పాలన చూడాలనుకున్నారో గానీ నీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొప్ప అవకాశం ఇచ్చారు. ఈ రకమైన అవకాశం వచ్చినప్పుడు ఎలా పరిపాలించాలి? అనేది ఆలోచించకుండా, నేను ఏంచేసినా చెల్లుతుందని అనుకోవడం జగన్ పిచ్చితనానికి నిదర్శనం. మనం చేసేవన్నీ ప్రజలు గమనిస్తుంటారు. వారు తగిన సమయంలో తగిన విధంగా బుద్ధి చెబుతారు.

ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు… గతంలో మేం అధికారంలో ఉన్నాం… మా ఐదేళ్లలో విజయవాడలో ఏనాడైనా శాంతిభద్రతల సమస్య వచ్చిందా? గతంలో నీ పార్టీ వాళ్లే తప్పు చేసినా ఎంతో సహనంతో వ్యవహరించాం. కానీ ఇవాళ కిరాయి మూకలు, పోలీసులు అండగా ఉన్నారని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే రేపనేది ఒకటుంటుందని గుర్తించాలి.

హిట్లర్, సద్దాం హుస్సేన్ వంటి నియంతలను ఈ ప్రపంచం చూసింది. పెద్ద పెద్ద సామ్రాజ్యాలే పోయాయి. నీక్కూడా తప్పకుండా బుద్ధి చెప్పే రోజొస్తుంది. అసలు ఈ ఆంధ్రప్రదేశ్ ను ఏంచేద్దామనుకుంటున్నారు?” అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Related posts

దేవినేని ఉమా అరెస్ట్‌.. బెజ‌వాడ‌లో ఉద్రిక్త‌త‌!

Drukpadam

ఢిల్లీలో ఈటల ,బండి సంజయ్ …అమిత్ షా తో భేటీ -రాష్ట్ర పరిస్థితులపై వివరణ…

Drukpadam

ప్రధాని మోడీ 100 వ మాన్ కి బాత్ లో డాక్టర్ పొంగులేటి ..

Drukpadam

Leave a Comment