Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీలో చంద్రబాబును పలకరించే వారే లేరు: మంత్రి బాలినేని

  • ఢిల్లీకి వెళ్లి చంద్రబాబు ఏం చేస్తారు?
  • ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో కూడా అర్థం కావడం లేదు
  • దేవుడులాంటి ఎన్టీఆర్ ను  చెప్పులతో కొట్టించారు
There is no one to speak to Chandrababu in Delhi says Balineni

టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం ఢిల్లీకి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అపాయింట్ మెంట్ ఖరారయింది. తన పర్యటనలో కేంద్ర మంత్రులను కూడా ఆయన కలిసే అవకాశముంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి వెళ్లి ఆయన ఏం ఫిర్యాదు చేస్తారని ప్రశ్నించారు. అసలు ఆయన ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో కూడా అర్థం కావడం లేదని చెప్పారు.

టీడీపీ కార్యాలయాన్ని దేవాలయం అని చెప్పుకునే చంద్రబాబు… ఆ పార్టీని ప్రారంభించిన దేవుడు ఎన్టీఆర్ ను చెప్పులతో ఎందుకు కొట్టించారని బాలినేని ప్రశ్నించారు. టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు చంద్రబాబు చరిత్ర గురించి చెపుతుంటే వినేందుకు తమకు అసహ్యం కలుగుతోందని అన్నారు. ఢిల్లీలో చంద్రబాబును పలకరించే వారే లేరని ఎద్దేవా చేశారు.

Related posts

సీనియర్ న్యాయవాది ప్రవర్తనపై సీజేఐ తీవ్ర ఆగ్రహం!

Drukpadam

బ్లాక్ టీ వల్ల బోలెడు ఉపయోగాలు …లండన్ అధ్యనంలో వెల్లడి …

Drukpadam

కోవిడ్ సేవలపై నిరంతర పర్యవేక్షణ-మంత్రి పువ్వాడ.*

Drukpadam

Leave a Comment