బద్వేలులో ఆర్మీ మొత్తాన్ని దించినా మాకేమీ ఇబ్బందిలేదు: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి!
ఈ నెల 30న బద్వేలు ఉప ఎన్నిక
కేంద్ర పరిశీలకుడికి ఫిర్యాదు చేసిన బీజేపీ
స్థానిక పోలీసులను తొలగించాలని విజ్ఞప్తి
తమకు ప్రజాబలం ఉందన్న శ్రీకాంత్ రెడ్డి
ఆర్మీ మొత్తాన్ని దించినా తమకేమీ ఇబ్బందిలేదని స్పష్టీకరణ
బద్వేల్ లో జరుగుతున్న ఉపఎన్నిక లో వైసీపీ , బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. స్థానిక పోలిసుల వల్ల నయం జరుగుతుందని తాము బావించడంలేదని బీజేపీ ఎన్నికకు సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో వైసీపీ స్పందించింది.ఎన్ని బలగాలనైనా దింపుకోండని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి బీజేపీ కి సవాల్ విసిరారు. ఎన్ని బలగాలు దింపిన తమ గెలుపును ఎవరు అడ్డుకోలేరని స్పష్టం చేశారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఎన్నికల కమిషన్ మేనేజ్ చేసుకోవచ్చినని భావిస్తుందని కానీ అలంటి పగటి కళలు కనడం కన్న పార్టీ ఇమేజీపై గెలవాలని అన్నారు.
బద్వేలు ఉప ఎన్నికలో స్థానిక పోలీసులను తొలగించాలంటూ ఏపీ బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకుడు భీష్మకుమార్ కు విజ్ఞప్తి చేయడం పట్ల ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. బద్వేలులో కేంద్ర బలగాలను దించి హడావుడి చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బద్వేలు అధికారులపై బీజేపీ లేనిపోని ఆరోపణలు చేస్తోందని అన్నారు. బద్వేలులో తమకు ప్రజాబలం ఉందని స్పష్టం చేశారు. మొత్తం ఆర్మీ బలగాలన్నింటినీ దించినా తమకేమీ ఇబ్బందిలేదని పేర్కొన్నారు. తాము కూడా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలనే కోరుకుంటున్నామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
ఆ సందర్భంగా ఆయన బీజేపీకి ఆసక్తికరమైన ఆఫర్ ఇచ్చారు. విభజన చట్టం హామీలు నెరవేర్చితే తాము పోటీ నుంచి తప్పుకుంటామని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, దుగరాజపట్నం పోర్టు, ఉక్కు పరిశ్రమ ఇవ్వాలని వివరించారు. ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధానమంత్రే స్వయంగా చెప్పారని వెల్లడించారు.