రూ. 3 కోట్లు చెల్లించాలంటూ రిక్షా పుల్లర్ కు ఐటీ నోటీసులు!
-ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకున్న ఘటన
-నోటీసులపై పోలీసులను ఆశ్రయించిన రిక్షా పుల్లర్
-కేసు నమోదు చేయలేమన్న పోలీసులు
-ఏమి చెయ్యాలో అర్థం కాకా లబోదిబో మంటున్న రిక్షా పుల్లర్
నార్త్ ఇండియా లో కొంత మంది ఖాతాల్లో కోట్లాది రూపాయలు పడుతున్నడం చూశాం …ఇప్పుడు అదే నార్త్ ఇండియా లో ఒక రిక్షా పుల్లర్ కు 3 కోట్ల రూపాయలు పన్నులు చెల్లించాలని ఐ టి శాఖ నోటీసులు పంపింది .రిక్షా తొక్కుకుని జీవనం సాగించే వారి జీవితాలు చాలా దుర్భరంగా ఉంటాయి. ఏ పూట తింటారో, ఏ పూట పస్తులు ఉంటారో కూడా వారికి తెలియదు. ఏరోజుకు ఆరోజు వారిది బతుకు పోరాటమే. అలాంటి ఓ రిక్షా పుల్లర్ కు ఐటీ శాఖ అధికారులు రూ. 3 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు పంపారు. ఉత్తరప్రదేశ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.
దీంతో రిక్షాతొక్కితేనే పూటగడిశె ఆ పేద కుటుంబం నోటీసులు అర్థంకాక ఒక చదువచ్చిన ఆయన దగ్గర చూపించింది. అది చూసిన చదువుకున్న వ్యక్తి అతాశయుడై ఆ రిక్షా పుల్లర్ వెనక ఎగాదిగా చూసి నివ్వు ఏంపని చేశతావని అడిగాడు . దానికి నేను రిక్షా తొక్కుతానని చెప్పిన నమ్మలేదు. నిజంగానే రిక్షా తొక్కుతానని చెప్పడంతో నువ్వు ఐ టి శాఖకు 3 కోట్ల పన్ను కట్టాలని ఐ టి శాఖ నోటీసులు పంపించారు. అనడంతో ఆరీక్షా పుల్లర్ ఆశ్చర్య పోయారు.
మథురలోని బకల్ పూర్ ప్రాంతంలోని అమర్ కాలనీకి చెందిన ప్రతాప్ సింగ్ కు ఈ నోటీసులు వచ్చాయి. దీంతో, ఆయన పోలీసులను ఆశ్రయించాడు. అయితే రిక్షాపుల్లర్ ఫిర్యాదుపై కేసు నమోదు చేయలేమని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏం చేయాలో అర్థంకాక తనకు అందిన నోటీసులను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.