Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఎవరూ వద్దనలేదుగా… ఏపీలో టీఆర్ఎస్ పార్టీని పెట్టుకోవచ్చు: సజ్జల!

ఎవరూ వద్దనలేదుగా… ఏపీలో టీఆర్ఎస్ పార్టీని పెట్టుకోవచ్చు: సజ్జల!
-ఏపీలో టీఆర్ఎస్ పార్టీని పెడతామంటే ఎవరైనా వద్దన్నారా?
-శ్రీశైలం నీటితో తెలంగాణ అడ్డగోలుగా విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటోంది
-రాష్ట్రం విడిపోతే ఏపీకి కష్టాలు వస్తాయని మేము ముందే చెప్పాం

ఈటల జరిగిన టీఆర్ యస్ ప్లీనరీ సమావేశంలో టీఆర్ యస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రగతి ఇక్కడ అమలు జరుగుతున్నా సంక్షేమ కార్యక్రమాలు గురించి సుదీర్ఘంగా వివరించారు. దేశం మొత్తం తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధిపై చర్చిస్తుందని ,తెలంగాణాలో లో తాము కలుస్తామని అంటున్నారని కేసీఆర్ తెలిపారు. రాయచూర్ , నాందేడ్ నుంచి అలంటి డిమాండ్స్ ఉన్నాయని , అదే విధంగా తమ రాష్ట్రలో పార్టీ పెట్టాలని తాము మీ పార్టీని గెలిపించుకుంటామని పక్కన ఆంధ్రా ప్రజలు అంటున్నారని కేసీఆర్ అన్నారు . దీనిపై వైసీపీ నేత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి స్పందించారు . ఆంధ్రాలో పార్టీ పెడతామని కేసీఆర్ ని ఎవరు వద్దని అంటున్నారని అన్నారు .

టీఆర్ఎస్ పార్టీ ఏపీలోకి రావాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి వేలాది విన్నపాలు వచ్చాయంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ప్లీనరీలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఏపీలో టీఆర్ఎస్ పార్టీని పెడతామంటే ఎవరైనా వద్దన్నారా? అని ప్రశ్నించారు. ఎవరైనా ఎక్కడైనా పార్టీని పెట్టకోవచ్చని… ఏపీలో టీఆర్ఎస్ పార్టీని కూడా పెట్టుకోవచ్చని అన్నారు.

శ్రీశైలం ప్రాజెక్టు నీటిని అడ్డగోలుగా వాడుతూ విద్యుత్ ను ఉత్పత్తి చేసుకుంటున్నారని… అందుకే తెలంగాణలో కరెంట్ కష్టాలు లేవని సజ్జల మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ను విభజిస్తే ఏపీకి కష్టాలు వస్తాయని, రాష్ట్రంలో అంధకారం నెలకొంటుందని, నీటి సమస్యలు తలెత్తుతాయని తాము ముందే చెప్పామని అన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణకు కరెంట్ కష్టాలు లేవని, ఏపీకి మాత్రం ఉన్నాయని చెప్పారు. విద్యుత్ కష్టాలను అధిగమించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటోందని అన్నారు.

Related posts

ఏపీ కోటాలో రాజ్య‌స‌భ‌కు వెళ్ల‌నున్న న‌లుగురు ప్ర‌ముఖుల బ‌యోడేటాలు ఇవే

Drukpadam

తుమ్మలకు ఎమ్మెల్సీ అంటూ వస్తున్న వార్తలు ..ఏది నిజం …ఏది అబద్దం!

Drukpadam

కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై దుమ్మెత్తి పోస్తున్న విపక్షాలు!

Drukpadam

Leave a Comment