Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌ల్లో పాల్గొన్న మ‌హిళా రైతులు.. తిరిగి వెళ్తుండ‌గా ట్ర‌క్కు ఢీ కొని ముగ్గురి మృతి!

సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌ల్లో పాల్గొన్న మ‌హిళా రైతులు.. తిరిగి వెళ్తుండ‌గా ట్ర‌క్కు ఢీ కొని ముగ్గురి మృతి
-హ‌ర్యానాలో ఘ‌ట‌న
-మ‌రో న‌లుగురు రైతులకు గాయాలు
-పారిపోయిన ట్ర‌క్కు డ్రైవ‌ర్

ఇటీవలనే లకింపుర్ ఖేరి లో కేంద్రమంత్రి కాన్వాయ్ లోని ఒక వాహనం రైతుల ప్రదర్శనపై నుంచి పోవడంతో ౯ మంది రైతులు మరణించిన విషయం మరకవకముందే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్నా ఆందోళనలో పాల్గొన్న మహిళా రైతులు తిరిగి ఇంటికి వెళ్లేందుకు రోడ్ పక్కన కూర్చోగా రోడ్ పై వెళ్తున్న వాహనం వారిమీద నుంచి పోవడంతో ముగ్గురు మహిళా రైతులు మరణించారు.

సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌ల్లో పాల్గొన్న మ‌హిళా రైతులు తిరిగి ఇంటికి వెళ్తుండ‌గా ఓ ట్ర‌క్కు ఢీ కొట్టడంతో, వారిలో ముగ్గురు మృతి చెంద‌డం కల‌కలం రేపింది. హ‌ర్యానాలోని ఝజ్జర్ రోడ్ లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన సాగుచ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా టిక్రీలో రైతులు ఆందోళ‌న కొన‌సాగిస్తున్నారు. అందులో పాల్గొన్న మ‌హిళా రైతులు ఈ రోజు ఉద‌యం ఇంటికి వెళ్ల‌డానికి ఝ‌జ్జ‌ర్ రోడ్‌లోని ఓ డివైడ‌ర్ మీద కూర్చొని ఆటో రిక్షా కోసం ఎదురుచూస్తున్నారు.

అదే స‌మ‌యంలో ప్ర‌మాద‌వశాత్తూ ఓ ట్ర‌క్కు వ‌చ్చి వారిని ఢీ కొట్టింది. దాంతో ఇద్ద‌రు మ‌హిళా రైతులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా, మ‌రొక‌రు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ప‌రిస్థితి విష‌మించి మృతి చెందారు. ఈ ప్రమాదంలో మ‌రో న‌లుగురు రైతులకు గాయ‌ల‌య్యాయి. వారిలో ముగ్గురు మ‌హిళ‌లే ఉన్నారు. ఈ ప్ర‌మాదం జ‌రిగిన త‌ర్వాత ట్ర‌క్కు డ్రైవ‌ర్ పారిపోయాడు.

Related posts

నా భర్త విషయంలో జోక్యం చేసుకోండి … బ్రిటన్ రాణికి చోక్సీ భార్య ప్రీతి విన్నపం!

Drukpadam

పనిమనిషిపై ఎమ్మెల్యే కొడుకు, కోడలు వేధింపులు… పరారీలో నిందితులు

Ram Narayana

హథ్రాస్ పాపం ఎవరిదీ …తొక్కిసలాటలో రక్తపాతం 122 మంది మృతి …

Ram Narayana

Leave a Comment