Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రాజధాని రైతుల ‘మహా పాదయాత్ర’కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

రాజధాని రైతుల ‘మహా పాదయాత్ర’కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్!
-‘న్యాయస్థానం టు దేవస్థానం’ రైతుల పాదయాత్ర
-నవంబరు 1 నుంచి రైతుల పాదయాత్ర
-అనుమతి ఇవ్వలేమన్న డీజీపీ గౌతమ్ సవాంగ్
-హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన రైతులు
-నేడు తీర్పు వెల్లడించిన న్యాయస్థానం

అమరావతి రాజధాని రైతుల ఉద్యమం రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు తిరుపతి వెంకటేశ్వర స్వామి ని దర్శించుకొని తన డిమాండ్లను ప్రచారం గావించేందుకు చేపట్టిన ‘న్యాయస్థానం టు దేవస్థానం’ రైతుల పాదయాత్ర కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.దీంతో 47 రోజులపాటు ఈ పాదయాత్ర కొనసాగనున్నది .శాంతి భద్రతల సమస్య వస్తుందని ప్రభుత్వం వాదించినప్పటికీ ,ప్రభుత్వ వాదనలు పట్టించుకోకుండా పాదయాత్రకు అనుమతి ఇవ్వడం పై రాజధాని ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అమరావతి ఉద్యమం ఎందుకు చేపట్టాల్సి వచ్చిందన్న విషయాన్ని రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలియజేసే ఉద్దేశంతో రాజధాని రైతులు ‘మహా పాదయాత్ర’ చేపట్టడం తెలిసిందే. తాజాగా ఈ పాదయాత్రకు ఏపీ హైకోర్టు పచ్చజెండా ఊపడం పై దీక్షలు చేస్తున్న వారిలో సంతోషం వ్యక్తం అవుతుంది. రైతులు పాదయాత్ర చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. రైతుల పాదయాత్రకు అనుమతి ఇవ్వలేమంటూ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అమరావతి పరిరక్షణ సమితికి లేఖ ద్వారా తెలియజేయగా, రైతులు హైకోర్టును ఆశ్రయించారు. రైతుల దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను కోర్టు నేడు విచారించింది.

వాదనల సందర్భంగా… రైతులు గ్రామాల్లోకి వెళితే వారిపై రాళ్లు విసిరే ప్రమాదం ఉందని, రైతుల పాదయాత్రతో శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రైతుల తరఫు న్యాయవాది లక్ష్మీనారాయణ స్పందిస్తూ, రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారని వెల్లడించారు. అనుమతి ఇవ్వలేమంటూ డీజీపీ పంపిన లేఖలో సరైన కారణాలు లేవని కోర్టుకు నివేదించారు.

ఈ నేపథ్యంలో కోర్టు… రైతులు పాదయాత్ర చేస్తే ప్రభుత్వానికి, పోలీసులకు ఏమిటి అభ్యంతరం? అని ప్రశ్నించింది. ఈ క్రమంలో రైతుల పాదయాత్రకు అనుమతి ఇస్తున్నట్టు పేర్కొంది. హైకోర్టు తీర్పుతో అమరావతి వర్గాలు సంతోషం వెలిబుచ్చాయి.

‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో నవంబరు 1 నుంచి డిసెంబరు 17 వరకు రైతులు మహా పాదయాత్ర చేస్తున్నారు. అమరావతి నుంచి తిరుమల వరకు ఈ యాత్ర సాగనుంది.

Related posts

ముగిసిన టోక్యో ఒలింపిక్ క్రీడలు… అమెరికాకు అగ్రస్థానం!

Drukpadam

శ్రీకృష్ణ రాయబారం విఫలం కావడంతో ఎంతటి తీవ్ర పర్యవసానాలు జరిగాయో అందరికీ తెలుసు: సీజేఐ ఎన్వీ రమణ!

Drukpadam

ఖమ్మంలో టీఆర్ యస్ నుంచి భారీ క్రాస్ ఓటింగ్ …పార్టీ లో అంతర్మధనం

Drukpadam

Leave a Comment