జిల్లాలో విస్తృత తనిఖీలతో జల్లెడ పడుతున్న ఖమ్మం పోలీసులు
-అక్రమ రవాణా, నేరాల నియంత్రణకు నిరంతరం నిఘా బృందాలు
-అసాంఘిక కార్యకలాపాలతో మితి మీరిపోతున్న అకాతాయిలపై చర్యలు
-బస్‌స్టాండు ,రైల్వే స్టేషన్ ,రహదారుపై నేరస్తుల కదలికపై క్షేత్రస్ధాయిలో దృష్టి
– ఏసీపీ స్ధాయి అధికారుల పర్యవేక్షణలో ముమ్మరంగా తనిఖీలు
అక్రమ రవాణా, నేరాల నియంత్రణకు నిరంతరం విస్తృత తనిఖీలు కొనసాగిస్తున్న ఖమ్మం పోలీసులు ….అసాంఘిక కార్యకలాపాలపై, పాత నేరస్తుల కదలికపై నిఘా ఉండాలన్న పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆదేశాల మేరకు ప్రతిరోజు ఏసీపీ స్దాయి అధికారుల పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు అధికారులు, సిబ్బంది బస్‌స్టాండు ,రైల్వే స్టేషన్లు, రహదారిపై విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు.
జిల్లాలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం వాటిల్లకుండా, అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా, మాదక ద్రవ్యాలు,గంజాయి, నిషేధిత పొగాకు ఉత్పత్తులు వంటి వాటి యొక్క అక్రమ రవాణా నిరోధించే ఉద్దేశంతో ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూన్నారు. అనుమానిత వ్యక్తులు గాని, వాహనాలు గాని తారసపడితే వాటి గురించి పూర్తి వివరాలను సేకరించి, అనంతరం వారి ప్రయాణానికి వెసులుబాటు కల్పిస్తున్నారు.
అదేవిధంగా బైక్ ర్యాష్ డ్రైవింగ్, సౌండ్ పొల్యూషన్, ఈవ్ టిజింగ్, అర్ధరాత్రి రోడ్లపై పుట్టిరోజు వేడుకలు చేస్తూ… అసాంఘీక కార్యకాలపాలతో మితి మీరిపోతున్న అకాతాయిలపై ప్రత్యేక దృష్టి సారించి చెక్ పెట్టాలని పోలీస్ కమిషనర్ సూచనలతో పోలీస్ అధికారులకు దృష్టి సారించారు.