Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు పాల్గొన్న కుప్పం సభలో ఆగంతుకుడి కలకలం….

చంద్రబాబు పాల్గొన్న కుప్పం సభలో ఆగంతుకుడి కలకలం….
-చంద్రబాబును కవర్ చేసిన కమాండోలు
-కుప్పంలో చంద్రబాబు సభ
-అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి
-పట్టుకున్న టీడీపీ కార్యకర్తలు
-వ్యక్తి దగ్గర రాళ్ళు ఉన్నట్లు గుర్తించమన్న టీడీపీ కార్యకర్తలు
-గుర్తుతెలియని వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-సీఎం డౌన్ డౌన్ అంటూ మారుమోగిన కుప్పం సభ

చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించడం ,వైసీపీ టీడీపీ లమధ్య మాటలయుద్ధం పొలిటికల్ హిట్ ను పెంచింది. కుప్పంలో జరిగిన సభలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి అనుమానంస్పదంగా కనిపించడంతో టీడీపీ కార్యకర్తలు అతన్ని పట్టుకొని నిర్బంధించారు. అతని వద్ద కొన్ని రాళ్ళు ఉన్నట్లు గుర్తించామని టీడీపీ వర్గాలు అంటున్నాయి. చివరకు గుర్తు తెలియని వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. వారు అతన్ని విచారిస్తున్నారు. చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా ఆయనపై బాంబు వేస్తానని వైసీపీ నాయకుడు ప్రకటించడంతో టీడీపీ కార్యకర్తలు అలర్ట్ అయ్యారు. అనుమానాస్పందంగా తిరుగుతున్నా వ్యక్తిని పట్టుకున్నారు. ఇది సభలో కలకలానికి కారణమైంది.

చంద్రబాబు కుప్పంలో పెద్ద ఎత్తున జనసమీకరణ చేసి భారీ సభ పెట్టారు . ఈ సందర్భంగా ఒక ఆగంతుకుడు కలకలం సృష్టించాడు. చంద్రబాబు సభ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో అతడిని టీడీపీ కార్యకర్తలు నిర్బంధించారు. బాంబు తెచ్చేడేమోనన్న అనుమానంతో అతడిని పోలీసులకు అప్పగించారు. అతడి వద్ద రాళ్లు ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో, అప్పటివరకు వెనుక నిల్చున్న కమాండోలు ఒక్కసారిగా ముందుకు వచ్చి చంద్రబాబు చుట్టూ కవచంలా నిలిచారు. టీడీపీ కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తం అయింది. ఏమి జరుగుతుందో తెలుసుకునేందుకు ఒక్కసారిగా ముందుకు తోసుకొచ్చారు. వారిని వెనక్కు పంపేందుకు ఇటు పోలీసులు ఇటు కమెండోలు శ్రమించాల్సి వచ్చింది.

ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ, బాబాయ్ ని చంపిననోడికి భయం కానీ, మనకెందుకు భయం అంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వైసీపీ గూండాయిజం నశించాలి, సీఎం డౌన్ డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. అటు చంద్రబాబు పర్యటన సందర్భంగా కుప్పంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. ఒకరి ఫ్లెక్సీలను మరొకరు పరస్పరం ధ్వంసం చేసుకున్నారు.

Related posts

ఆసక్తిక‌ర స‌న్నివేశం!.. బాలినేని వెంట జ‌గ‌న్ వ‌ద్ద‌కు క‌ర‌ణం బ‌ల‌రాం!

Drukpadam

తెలుగు ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడిగా దిల్ రాజు విజయం

Ram Narayana

సరదా కోసం శారీరక సంబంధాలకు దిగజారే స్థితికి మనదేశ యువతులు ఇంకా చేరుకోలేదు: మధ్యప్రదేశ్ హైకోర్టు!

Drukpadam

Leave a Comment