Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

హుజురాబాద్ లో ఈటలకే జీ హుజూర్ అన్న ఓటర్లు …ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు !

హుజురాబాద్ లో ఈటలకే జీ హుజూర్ అన్న ఓటర్లు …ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు!
-ముగిసిన హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్
-ఈటల వైపే మొగ్గు చూపుతున్న ఎగ్జిట్ పోల్స్
-ఈటలకు 50 శాతం పైగా ఓట్లు వచ్చాయంటున్న సర్వే సంస్థలు
-రెండోస్థానంలో టీఆర్ఎస్ అని వెల్లడి
-కాంగ్రెస్ కు 5 నుంచి 7 శాతం మధ్య ఓట్లు

హోరాహోరీగా జరిగిన హుజురాబాద్ లో భారీగా పోలింగ్ జరిగింది. ప్రత్యేకించి మహిళలు , యువకులు అధికసంఖ్యలో పోలింగ్ స్టేషన్ ల వద్ద గుమికూడారు.ప్రత్యేకించి టీఆర్ యస్ చీఫ్ పోలింగ్ ఉన్న కౌశిక్ రెడ్డి పోలింగ్ భూతుల వద్దకు వచ్చినప్పుడు ఆయనమీద తిరగబడ్డారు. ఆయన ఒకటికి రెండు సార్లు పోలింగ్ బూతులవద్దకు వచ్చి కారు గుర్తుకు ఓటు వేయమని చెబుతున్నారని ప్రత్యేకించి మహిళలు అభ్యంతర పెట్టడం ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతున్నారనే సంకేతాలు ఇచ్చినట్లు అయింది. ఎగ్జిట్ పోల్స్ లోను అదే ప్రతిబంబించింది . హుజురాబాద్ లో ఈటల రాజేందర్ గెలవబోతున్నట్లు ఒకటి రెండు సంస్థలు మినహా అన్ని సంస్థలు చెప్పాయి. కాంగ్రెస్ పరిస్థితి మరీఘోరంగా ఉంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన మొదటి ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదని సర్వే లు తెలుపు తున్నాయి. బలమూరి వెంకట్ కు కేవలం 5 నుంచి 15 వేల ఓట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని పరిశీలకుల అభిప్రాయంగా ఉంది.

హుజూరాబాద్ (తెలంగాణ), బద్వేలు (ఏపీ) అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలైంది.

సర్వే సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం …. వివిధ పార్టీలకు వచ్చే ఓట్ల శాతాలు

హుజూరాబాద్ విషయానికొస్తే మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కే మొగ్గు ఉన్నట్టు ఆత్మసాక్షి గ్రూప్ పేర్కొంది. అయితే ఈటల స్వల్ప తేడాతోనే గెలుస్తారని, భారీ విజయం దక్కకపోవచ్చని అంచనా వేసింది. ఈటలకు 50.5 శాతం ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు 43.1 శాతం ఓట్లు అంటూ తన అంచనాలు ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ బల్మూరి ఓట్ల శాతం 5.7 మాత్రమేనని ఆత్మసాక్షి పేర్కొంది. ఈటల రాజేందర్ పై సానుభూతి అంశం ఓటర్లను బాగా ప్రభావితం చేసిందని వెల్లడించింది.

కౌటిల్య సొల్యూషన్స్ సంస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ 47 శాతం, టీఆర్ఎస్ 40 శాతం, కాంగ్రెస్ 8 శాతం ఓట్లు సంపాదిస్తాయని వెల్లడైంది.

పోల్ ల్యాబొరేటరీ సంస్థ ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ చూస్తే…. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానాన్ని ఈటల రాజేందర్ 23 వేల ఓట్ల తేడాతో నెగ్గబోతున్నారని తెలిపింది. ఈటలకు 51 శాతం, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు 42 శాతం, కాంగ్రెస్ అభ్యర్థికి 3 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని వివరించింది.

ఇక ఏపీలో బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీదే విజయం అని… బీజేపీ, కాంగ్రెస్ బలహీన అభ్యర్థులను బరిలో నిలపడంతో వైసీపీ గెలుపు మార్జిన్ భారీగా ఉండనుందని అంచనాలు వెలువడ్డాయి.

Related posts

నిన్న కాంగ్రెస్ లో చేరిక నేడు రాజీనామా..డి .శ్రీనివాస్ విషయంలో ట్విస్ట్!

Drukpadam

ఖమ్మం సభద్వారా రాహుల్ కు పరిపక్వత లేదని మరోసారి రుజువైంది…..మంత్రి పువ్వాడ అజయ్!

Drukpadam

మహిళలకు సాయం కోసం ‘వైఎస్ఎస్ఆర్ టీమ్’ ఏర్పాటు: షర్మిల

Drukpadam

Leave a Comment