Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బద్వేల్ ఉప ఎన్నికల్లో అవినీతి అరాచకం అక్రమాలు: సోము వీర్రాజు!

బద్వేల్ ఉప ఎన్నికల్లో అవినీతి అరాచకం అక్రమాలు: సోము వీర్రాజు!
-బద్వేలు ఉప ఎన్నికలో పోలింగ్ శాతం ఒక్కసారిగా పెరగటానికి కారణం ఇదే!
-దొంగ ఓటర్లు వ‌చ్చారు
-పోలింగ్ బూత్ లో వైసీపీ నాయకులు దొంగ ఓట్లు వేసుకున్నారు
-గుర్తించిన చోట రీ-పోలింగ్ పెట్టాల‌ని కోరాం

బద్వేలు ఉప ఎన్నికలో పోలింగ్ శాతం ఒక్కసారిగా పెరగటానికి కారణం కేవలం దొంగ ఓటర్లేన‌ని బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు చెప్పారు. నిన్న బ‌ద్వేలు ఉప ఎన్నిక‌లో బ‌య‌టి వ్య‌క్తులు వ‌చ్చి ఓట్లు వేశార‌ని బీజేపీ ప‌లు వీడియోలు కూడా పోస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. అలాగే, అధికారుల‌కు కూడా బీజేపీ నేత‌లు ఫిర్యాదు చేశారు. ఆయా అంశాల‌పై సోము వీర్రాజు ట్విట్ట‌ర్ ద్వారా మ‌రోసారి స్పందించారు.

‘బద్వేలు ఉపఎన్నికలో అవినీతి, అరాచక, కుటుంబ, రాచరిక పాలనకు వ్యతిరేకంగా, అభివృద్ధికి మ‌ద్ద‌తుగా నిజాయితీగా ఓట్లు వేసిన ఓటరు మహాశయులందరికీ భారతీయ జనతా పార్టీ కృతజ్ఞతలు తెలియజేస్తోంది’ అని సోము వీర్రాజు చెప్పారు.

‘బద్వేలు ఉప ఎన్నికలో పోలింగ్ శాతం ఒక్కసారిగా పెరగటానికి కారణం కేవలం దొంగ ఓటర్లు, పోలింగ్ బూత్ లో కూర్చొని వైఎస్సార్ సీపీ నాయకులు వేసుకున్న దొంగ ఓట్లు. ఈ అరాచకాలన్నింటిపై ఎన్నికల అధికారులందరికీ ఫిర్యాదు చేశాము. గుర్తించిన చోట రీ-పోలింగ్ పెట్టమని కోరాము’ అని సోము వీర్రాజు తెలిపారు.

‘వైఎస్సార్ సీపీ నాయకులు సాగిస్తున్న అరాచకాలను రాష్ట్ర ప్రజలందరూ చాలా నిశితంగా గమనిస్తూ ఉన్నారు. వారిలో ఉన్న తీవ్రమైన వ్యతిరేకతను రాబోయే రోజుల్లో మీపై తప్పకుండా చూపిస్తారు, మిమ్మల్ని గద్దె దించుతారు’ అని సోము వీర్రాజు చెప్పారు.

 

బద్వేలులో ఓటర్లను అద్దెకు తెచ్చి దొంగ ఓట్లు వేయించారు: జీవీఎల్

GVL comments on Badvel by election
కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ నిన్న ముగిసింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వైసీపీపై ధ్వజమెత్తారు. ఓటర్లను అద్దెకు తెచ్చి దొంగ ఓట్లు వేయించారని ఆరోపించారు. బద్వేలులో అధికార దుర్వినియోగం జరిగిందని మండిపడ్డారు. పోలీసులు అధికార పార్టీకి సహకరించారని వెల్లడించారు. వైసీపీ అక్రమాలపై ఆధారాలు ఇచ్చామని, 28 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.

 

Related posts

దళిత బందు కొత్త చిక్కులు …లబ్ది దారుల ఎంపికపై గరం గరం!

Drukpadam

30 రోజులు కావాలని బయట డైలాగులు కొడతారు.. లోపల 30 నిమిషాలైనా కూర్చోరు: కేటీఆర్

Ram Narayana

పార్టీ విరాళాల సేకరణలో టాప్ లో ఉన్న టీఆర్ యస్ ,టీడీపీ ,వైసీపీ!

Drukpadam

Leave a Comment