వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను: అఖిలేశ్ యాదవ్ సంచలన ప్రకటన!
-యూపీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు
-ఆర్ఎల్డీతో పొత్తు ఖరారయిందన్న అఖిలేశ్
-తన బాబాయ్ తో ఇబ్బంది లేదని వ్యాఖ్య
వచ్చే ఏడాది జరగనున్న యూ పీ ఎన్నికలకోసం అన్ని రాజకీయపార్టీలు వ్యూహాలల్లో మునిగితేలుతున్నాయి. దేశంలోనే అతిపెద్దరాష్ట్రమైన యూ పీ ని తిరిగి ఎలాగైనా తమ పరిపాలన కొనసాగించేలా అధికార బీజేపీ పావులు కదుపుతుంది. అందుకు ప్రతిగా అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఎస్పీ కూడా బీజేపీ కి ఏమాత్రం తీసిపోకుండా వ్యూహరచనలు చేస్తుంది. 403 అసెంబ్లీ సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే 202 గెలవాలి . కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 80 పార్లమెంట్ సీట్లు కలిగిన యూ పీ ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు .అయితే నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన జరుపుతున్నారు. దానికి ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఉంది. బీజేపీ కి వ్యతిరేకంగా రైతులు ఐక్యమౌతున్నారు.
ఇది ఎలా ఉండగా 2022 యూ పీ అసెంబ్లీ కి జరగనున్న ఎన్నికల్లో తాను పోటీచేయటంలేదని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. అంటే దానర్థం ఆయన ఎన్నికలకు దూరంగా ఉంటున్నారని కాదు . అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ఆయన పోటీచేయబోవటం లేదని ప్రకటించారు.
భారత రాజకీయాలను శాసించే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికలు మినీ మహాభారత యుద్దాన్ని తలపించనున్నాయి . రాష్ట్రంలో అధికారంలో ఉండే పార్టీకి ఢిల్లీలో ఎంతో పవర్ ఉంటుంది. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీకి ఎన్నికల జరగబోతున్నాయి. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని అన్నారు.
రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) పార్టీతో సమాజ్ వాదీ పార్టీకి పొత్తు ఉంటుందని చెప్పారు. పొత్తు ఖరారయిందని, సీట్ల పంపకాలపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. తన బాబాయ్ శివపాల్ యాదవ్ కు చెందిన ప్రగతిశీల్ సమాజ్ వాదీ పార్టీ లోహియా (పీఎస్పీఎల్)తో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని… వారితో కలిసి పని చేయడంలో అభ్యంతరం లేదని చెప్పారు. అఖిలేశ్ యాదవ్ ప్రస్తుతం ఆజంఘర్ నుంచి ఎంపీగా ఉన్నారు.