రజనీకాంత్ తో కమల్ హాసన్ భేటీ
-మర్యాద పూర్వక భేటీని అన్న కమల్ హాసన్ అభిమానులు
-రాజకీయాలకోసమే కలిశారన్నతున్న పరిశీలకులు
———–////——————//////——————–/////———————
తన మిత్రుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ తో సినీ నటుడు, మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ భేటీ అయ్యారు. తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని రజనీకాంత్ ప్రకటించిన తర్వాత ఆయనను కమల్ కలవడం ఇదే తొలిసారి. ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కమల్ పూర్తి స్థాయిలో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. సీరియస్ రాజకీయనాయకుడిగా మారారు కమల్ హాసన్ . త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇరువురి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. పార్టీ పెడతానని ప్రకటించిన రజనీకాంత్ అనంతరం అనారోగ్యం పాలవడం పార్టీ ఆలోచన విరమించుకోవటం తెలిసిందే . ఆయన అభిమానులకు తమకు ఇష్టమైన పార్టీలో చేరమని కూడా చెప్పారు. అయన ప్రాపకంకోసం చాలామంది ప్రయత్నిస్తున్నారు. కమల్ దానిలో భాగంగా చేరారా ? లేక స్నేహితుణ్ని మర్యాద పూర్వకంగానే కలిశారా ? అనేది చర్చనీయాంశంగా మారింది. తమిళ నాడులో ఏది జరిగిన సంచలనమే . అందువల్ల వారు మాములుగా కలిశారా ? రాజకీయాలకోసం కలిశారా ? అనేదానిపై కమల్ హాసన్ సన్నిహితులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇద్దరి మధ్య రాజకీయాలు చర్చకు రాలేదని వారు తెలిపారు. 2018లో మక్కల్ నీధి మయ్యమ్ పార్టీని కమల్ ప్రారంభించారు. ఎన్నికలకు సంబంధించి తన మిత్రుడు రజనీ మద్దతు కోరుతానని ఇటీవల కమల్ హాసన్ ప్రకటించారు. ఇద్దరు ఆత్మీయంగా మాట్లాడుకున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.