Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వచ్చే నెల 9న రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభ: రేవంత్ రెడ్డి!

వచ్చే నెల 9న రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభ: రేవంత్ రెడ్డి!
-రాష్ట్రంలో 30 లక్షల సభ్యత్వాలను నమోదు చేస్తామని సోనియాకు మాట ఇచ్చాం
-పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి రూ. 2 లక్షల జీవిత బీమా
-ఈ నెల 14 నుంచి 21 వరకు జన జాగరణ యాత్ర

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తెలవాలన్న పట్టుదలతో ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు.ఇప్పటికే రాష్ట్రంలో అనేకమంది ప్రముఖులను కలిసిన రేవంత్ వారిని పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అంటే కాకుండా కాంగ్రెస్ నుంచి టీఆర్ యస్ లో చేరిన ఎమ్మెల్యే ను కూడా తిరిగి పార్టీ లో చేరాలని పిలుపు నిచ్చారు. టీఆర్ యస్ కు ప్రత్యాన్మాయం గా పార్టీని నడిపించేందుకు రేవంత్ చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలను ఇస్తాయా ? లేదా అనే సందేహాలు లేకపోలేదు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తో హైద్రాబాద్ లో సభ పెట్టించటం ద్వారా పార్టీ కు దూరంగా ఉన్న నేతలను సైతం ఆకర్షించేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

రాష్ట్రంలో 30 లక్షల సభ్యత్వాలను చేస్తామని తమ అధినేత్రి సోనియాగాంధీకి మాట ఇచ్చామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకోవడం అంటే కాంగ్రెస్ కుటుంబంలో సభ్యుడు కావడమేనని చెప్పారు. పార్టీ సభ్యత్వం తీసుకున్నవారికి రూ. 2 లక్షల జీవిత బీమా వర్తిస్తుందని తెలిపారు. దేశ బానిస సంకెళ్లను తెంచింది కాంగ్రెస్ పార్టీనే అని… దేశం కోసం ఎన్నో త్యాగాలను చేసింది కాంగ్రెస్ పార్టీనే అని చెప్పారు. రాహుల్ గాంధీ లాంటి గొప్ప నాయకుడి పార్టీలో సభ్యుడినని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంటుందని అన్నారు.

పార్టీ కార్యకర్తలకు ఈ నెల 9 నుంచి శిక్షణ కార్యక్రమాలను ప్రారంభిస్తామని రేవంత్ చెప్పారు. 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జన జాగరణ యాత్ర ఉంటుందని తెలిపారు. డిసెంబర్ 9న భారీ బహిరంగసభను నిర్వహిస్తామని చెప్పారు. పోలీసులు అనుమతిస్తే హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో సభ నిర్వహిస్తామని, ఇవ్వకపోతే నగర శివారులో నిర్వహిస్తామని తెలిపారు. ఈ సభకు రాహుల్ గాంధీ వస్తారని చెప్పారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పారు.

Related posts

ఆంధ్రాలో ఉండే వాళ్ళంతా రాక్షసులే అన్నదానిపై మంత్రి ప్రశాంత్ రెడ్డి వివరణ….

Drukpadam

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పాకిస్తాన్ కు ఘాటు హెచ్చరిక …

Drukpadam

పార్టీలకు మునుగోడు ఫీవర్ …

Drukpadam

Leave a Comment