Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అఖిలేష్ జిన్నాపై వ్యాఖ్యలు ఎస్పీ ,బీజేపీ ఆడుతున్న నాటకంలో భాగం:మాయావతి

అఖిలేష్ జిన్నాపై వ్యాఖ్యలు ఎస్పీ ,బీజేపీ ఆడుతున్న నాటకంలో భాగం:మాయావతి
-అఖిలేశ్ వ్యాఖ్యల వెనుక బీజేపీ హస్తం ఉంది
-జిన్నాను స్వాతంత్ర సమరయోధుడు అన్న అఖిలేశ్
-బీజేపీ, ఎస్పీలు కలిసి డ్రామా ఆడుతున్నాయన్న మాయావతి
-కులాలు, మతాల మధ్య గొడవలు పెట్టడం వీటికి అలవాటేనంటూ మండిపాటు

పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా స్వాతంత్ర సమరయోధుడు అంటూ సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు విమర్శలపాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందిస్తూ… అఖిలేశ్ వ్యాఖ్యల వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు. ఈ రెండు పార్టీలకు మధ్య మంచి ఒప్పందం ఉందని… రెండు పార్టీలు కలసి ఆడుతున్న డ్రామా ఇది అని అన్నారు. ముస్లింలపై ద్వేషాన్ని పెంచడం, హిందువుల ఓట్లను కొల్లగొట్టడం వంటి కుట్రలు ఈ వ్యాఖ్యల వెనుక ఉన్నాయని చెప్పారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ రెండు పార్టీల డ్రామాలు మరింత ఎక్కువవుతాయని అన్నారు. ఇరిద్దరు కలసి ఆడుతున్న డ్రామాలను ఉత్తరప్రదేశ్ ప్రజలు గమనించాలని అన్నారు. ముస్లిం ,హిందులమధ్య చిచ్చు పెట్టి ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బీజేపీ ఎస్పీ లు ఎన్ని నాటకాలు ఆడేందుకైనా సిద్ధపడతాయని ధ్వజమెత్తారు.

ఈ రెండు పార్టీల నైజం ఒకేలా ఉంటుందని… కులాలు, మతాల మధ్య గొడవలు పెట్టి, లబ్ధి పొందడం వీటికి అలవాటేనని మాయావతి దుయ్యబట్టారు. యూపీలో సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉంటే… కేంద్రంలో బీజేపీ బలంగా ఉంటుందని అన్నారు. అందుకే బీఎస్పీ అధికారంలోకి రాకూడదని బీజేపీ కోరుకుంటుందని మండిపడ్డారు. బీఎస్పీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు ఎస్పీ ,బీజేపీ లు ప్రజలను మభ్య పెడతాయని మాయావతి అన్నారు.

Related posts

ఎంపీ పదవికి అఖిలేష్ గుడ్ బై …అజాం ఖాన్ కూడా!

Drukpadam

పినపాక కాంగ్రెస్ అభ్యర్థిగా పి. శ్రీవాణి పేరు పరిశీలన ….!

Drukpadam

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో ఓట్ల లెక్క ప్రకారం టీఆర్ యస్ కు ఏకపక్షమే కానీ ….

Drukpadam

Leave a Comment