Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం… మాజీ మిస్ కేరళతో పాటు మాజీ రన్నరప్ కూడా మృతి!

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం… మాజీ మిస్ కేరళతో పాటు మాజీ రన్నరప్ కూడా మృతి!

  • -కొచ్చి సమీపంలో ఘటన
  • -అక్కడిక్కడే ప్రాణాలు వదిలిన అన్సీ, అంజనా
  • -2019లో మిస్ కేరళగా గెలిచిన అన్సీ
  • -అదే పోటీల్లో రన్నరప్ గా నిలిచిన అంజనా

కేరళలోని కొచ్చి సమీపంలో ఈ మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మాజీ మిస్ కేరళ అన్సీ కబీర్, మాజీ రన్నరప్ అంజనా షాజన్ మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న కారు  వైటీల్లా-పలరివట్టోమ్ జాతీయ రహదారి బైపాస్ లో ఓ మోటార్ సైక్లిస్టును తప్పించే క్రమంలో అదుపు తప్పింది. రోడ్డుపై పల్టీలు కొడుతూ పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది.

ఈ ఘటనలో అన్సీ, అంజనా అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. కారు డ్రైవర్ కు, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అన్సీ కబీర్ 2019లో మిస్ కేరళ అందాల పోటీల్లో విజేతగా నిలిచింది. ఇదే పోటీల్లో అంజనా కబీర్ రన్నరప్ గా నిలిచారు. వారిద్దరూ మంచి మిత్రులని బంధువులు వెల్లడించారు.

కాగా ప్రమాద సమయంలో డ్రైవర్ ఒక్కడే సీటు బెల్టు ధరించినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంతో అన్సీ, అంజనాల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Related posts

క్రికెటర్ రైనా బంధువులను హత్య చేసిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ రషీద్ ఎన్ కౌంటర్!

Drukpadam

డబ్బు లేని ఇంటికి తాళం వేయడం ఎందుకు కలెక్టర్?’.. అంటూ లేఖను వదిలి వెళ్లిన దొంగలు!

Drukpadam

ప్రజ్వల్ ఫ్లైట్ దిగగానే అరెస్ట్ ఖాయం …

Ram Narayana

Leave a Comment