అమాంతం పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర.. రూ.266 పెంపు
నేటి నుంచే అమల్లోకి
-ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.2,000.50
-గృహాల్లో వాడే ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో మార్పుల్లేవు
గ్యాస్ కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరను అమాంతం పెంచేశాయి. నేటి నుంచి వాణిజ్య సిలిండర్ ధర రూ.266 పెంచుతున్నట్లు ప్రకటించాయి. అయితే, గృహాల్లో వాడే ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను పెంచకపోవడం కాస్త ఊరటనిస్తోంది. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధర నెలకోసారి మారుతోన్న విషయం తెలిసిందే. ఆ సిలిండర్లు కొనుగోలు చేసిన అనంతరం సబ్సిడీ మొత్తం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.
కాగా, ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.1,734 నుంచి రూ.2,000.50 కు పెరిగింది. ముంబైలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1950, కోల్‌కతాలో రూ.2073.50, చెన్నైలో రూ.2133కు చేరింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతుండడంతో ఆందోళన చెందుతోన్న ప్రజల మీద గ్యాస్ ధరల భారం కూడా పడుతోంది. వాణిజ్య సిలిండర్లను ఎక్కువగా హోటళ్లు, ఇతర సంస్థల వినియోగిస్తుంటాయి.
వైసీపీ రిజిస్ట్రేషన్ రద్దు చేయండి… ఈసీని కోరిన టీడీపీ నేతలు
- ఈసీని కలిసిన కేశినేని నాని, కనకమేడల, కిష్టప్ప
- వైసీపీపైనా, సీఎం జగన్ పైనా ఫిర్యాదు
- మీడియాకు వివరాలు తెలిపిన కేశినేని నాని
- విజ్ఞప్తులు పరిశీలించేందుకు ఈసీ హామీ ఇచ్చిందని వెల్లడి
12 కేసుల్లో చార్జిషీట్లు ఎదుర్కొంటున్న జగన్ జైలుకు వెళ్లి బెయిల్ పై బయట ఉన్నారని ఈసీకి తెలియజేశామని చెప్పారు. అలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని ఎలా పాలిస్తాడని, ఏ విధంగా వారి పార్టీ నేతలతో బూతులు తిట్టిస్తున్నాడన్న విషయాన్ని ఈసీకి వివరించామని తెలిపారు. వైసీపీ గుర్తింపు రద్దు చేయాలని కోరామని, తమ విజ్ఞప్తిపై ఈసీ సానుకూలంగా స్పందించినట్టు కేశినేని నాని వెల్లడించారు. అన్ని విషయాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు వివరించారు.
వైఎస్సార్ అవార్డుల కార్యక్రమంలో కత్తి పద్మారావు వీల్ చెయిర్ ను స్వయంగా సరిచేసిన సీఎం జగన్…
- విజయవాడలో వైఎస్సార్ లైఫ్ టైమ్ అవార్డుల కార్యక్రమం
- వీల్ చెయిర్ లో వచ్చిన కత్తి పద్మారావు
- పైకిలేచేందుకు ఇబ్బందిపడిన వైనం
- పెడల్స్ సరిచేసి సాయపడిన సీఎం జగన్
దళిత సామాజిక వేత్త, రచయిత కత్తి పద్మారావు వీల్ చెయిర్ లో ఉండి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే కత్తి పద్మారావు అవార్డు అందుకునేందుకు పైకి లేవడానికి చాలా ఇబ్బందిపడ్డారు. దాంతో సీఎం జగన్ స్వయంగా చేయందించి ఆయనను పైకి లేపారు. అనంతరం అవార్డు ప్రదానం చేశారు. ఆపై వీల్ చెయిర్ కదలకపోవడంతో సీఎం జగన్ స్వయంగా పెడల్స్ ను సరిచేశారు. సీఎం అంతటివాడు తన పట్ల అంత శ్రద్ధ చూపడం పట్ల కత్తి పద్మారావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ దృశ్యం సభికులను విపరీతంగా ఆకట్టుకుంది.
జనసేన క్రియాశీలక కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందించిన పవన్ కల్యాణ్
- ఓ ప్రమాదంలో మరణించిన పిల్లా శ్రీను
- శ్రీను అనకాపల్లి నియోజకవర్గానికి చెందిన జనసైనికుడు
- శ్రీను మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన పవన్
- ఆయన కుటుంబ సభ్యులకు ఓదార్పు
ఆంధ్రా-ఒడిశా బోర్డర్ లో గంజాయి సాగుకు నక్సల్స్ సహకారం ఉంది: డీజీపీ గౌతమ్ సవాంగ్
- మాదకద్రవ్యాలపై స్పందించిన డీజీపీ
- ఇతర రాష్ట్రాలతో కలిసి పనిచేస్తామని వెల్లడి
- సమాచారం ఇచ్చిపుచ్చుకుంటామని వివరణ
- ‘ముంద్రా’ డ్రగ్స్ తో ఏపీకి సంబంధం లేదని పునరుద్ఘాటన