తెలంగాణ వార్తలు

ఫిబ్రవరి 5న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం!

  • మంత్రి వర్గ ఉపసంఘానికి రేపు అందనున్న కుల గణన నివేదిక
  • కుల గణన నివేదికకు ఆమోదం తెలపనున్న మంత్రి వర్గం
  • కుల గణన నివేదికను అసెంబ్లీ ముందుకు తీసుకొస్తామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 5వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించనున్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ప్రభుత్వం కుల గణన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

కుల గణనపై కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కుల గణన నివేదిక రేపు మంత్రివర్గ ఉపసంఘానికి అందుతుందని తెలిపారు. అనంతరం, ఈ నెల 5న మంత్రివర్గం ముందు కుల గణన నివేదికను ఉంచుతామని చెప్పారు. మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత కుల గణన నివేదికను అసెంబ్లీ ముందుకు తీసుకువస్తామని అన్నారు. ఇందుకోసం ఈ నెల 5న అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతుందని ఆయన వెల్లడించారు.

Related posts

 వెంటిలేట‌ర్‌పై నటుడు ఫిష్ వెంక‌ట్‌ .. సాయం కోసం భార్య వేడుకోలు

Ram Narayana

200 సీసీ కెమెరాలున్నా చిక్కకుండా ఇంజినీరింగ్ కాలేజీలో దొంగతనం!

Ram Narayana

ప్రజాభిప్రాయం మేరకే రైతు భరోసా పథకం అమలు …డిప్యూటీ సీఎం భట్టి

Ram Narayana