Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలురాజకీయ వార్తలు

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ పై ఐటీ పంజా… రూ.1000 కోట్ల విలువైన ఆస్తుల జప్తు!

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ పై ఐటీ పంజా… రూ.1000 కోట్ల విలువైన ఆస్తుల జప్తు!

  • పవార్ కుటుంబీకుల ఆస్తుల అటాచ్
  • రూ.600 కోట్ల విలువైన చక్కెర కర్మాగారం కూడా జప్తు
  • కిందటి నెలలో పవార్ తోబుట్టువులు, సన్నిహితుల ఇళ్లపై దాడి
  • కేంద్రం కావాలనే దాడులు చేయిస్తోందన్న అజిత్ పవార్
IT dept attaches Maharashtra Deputy CM Ajit Pawar assets

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుటుంబానికి చెందిన రూ.1000 కోట్ల విలువైన ఆస్తులను ఐటీ శాఖ జప్తు చేసింది. తాజాగా జప్తు చేసిన ఆస్తుల్లో ఒక్క జరందేశ్వర్ కోఆపరేటివ్ చక్కెర కర్మాగారం విలువే రూ.600 కోట్లు ఉంటుందని అంచనా. ఇది సతారాలో ఉంది.

ఇది కాకుండా అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్ కు చెందిన కార్యాలయం (రూ.25 కోట్లు), సౌత్ ఢిల్లీలో ఓ ఖరీదైన ఫ్లాట్ (రూ.20 కోట్లు), ముంబయి నారిమన్ పాయింట్ లోని నిర్మల్ టవర్ తో పాటు గోవాలోని ఓ రిసార్టు సహా పలు ఆస్తులను ఐటీ అధికారులు జప్తు చేశారు.

అక్టోబరులో అజిత్ పవార్ తోబుట్టువులు, సన్నిహితుల ఇళ్లు, సంస్థలపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేయగా… కేంద్రం కావాలనే తమపై దాడులు చేయిస్తోందని అజిత్ పవార్ ఆరోపించారు. తాము పన్నులు సక్రమంగానే చెల్లిస్తున్నామని అన్నారు. తాజా ఐటీ దాడులపై బీజేపీ నేత కిరీట్ సోమయ్య స్పందిస్తూ, జప్తు చేసిన ఆస్తులు అజిత్ పవార్ కుమారుడు, భార్య, తల్లి, సోదరి, అల్లుడి పేరు మీద ఉన్నాయని వివరించారు.

Related posts

పార్ల‌మెంటు సమీపంలో.. కేరళ కాంగ్రెస్ ఎంపీపై పోలీసు దెబ్బ!

Drukpadam

మిర్చికి నష్టపరిహారం ప్రకటించకపోతే …కేటీఆర్ పర్యటన అడ్డుకుంటాం :పోటు రంగారావు!

Drukpadam

అంబేద్కర్ ఆశయాల సాధనకోసమే పోటీ :ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి కొండ్రు సుధారాణి

Drukpadam

Leave a Comment