Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

షర్మిల నోటి వెంట జై తెలంగాణ…

షర్మిల నోటి వెంట జై తెలంగాణ
-రాజన్న సంక్షేమ రాజ్యమే లక్ష్యం
-రాజన్న మరణిస్తే తెలంగాణలోనే అనేక గుండెలు ఆగాయి.
-రంగారెడ్డి జిల్లా నేతల తో సమావేశం
షర్మిల నోటి వెంట జైతెలంగాణ నినాదం మారుమోగింది. రంగారెడ్డి జిల్లా నేతలతో నిర్వనించిన ఆత్మీయ సమావేశంలో ఆమె కొద్దీ సేపు అభిమానులతో మాట్లాడటానికి వచ్చి రావటంతోనే జై తెలంగాణ … జై తెలంగాణ… జై తెలంగాణ … జై తెలంగాణ ,జై వైయస్సార్ అంటూ చేసిన నినాదాలకు అభిమానులు శృతి కలపడంతో సమావేశ మందిరం మారుమోగింది. రాజన్న రాజ్యం తెలంగాణాలో తెచ్చుకునేందుకు మీరంతా సహకరించాలని కోరారు. ఆయన ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎందరి జీవితాలనే మార్చాయని అందరికి న్యాయం జరగాలని ఆయన పరితపించారని అన్నారు. ఆయన మరణించిన సందర్బాగా తెలంగాణలోనే అనేక గుండెలు ఆగిపోయాయని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా అభిమానుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. వారికీ అనేక ప్రశ్నలను ఆమె సంధించారు. వారి చెప్పిన సమాధానాలను ఆశక్తిగా విన్నారు. షర్మిల పార్టీ పెడతారనే అభిప్రాయాలూ వెల్లు ఎత్తటంతో లోటస్ పాండ్ కు సందర్శకుల తాకిడి ఎక్కువైంది. ఆమె జై తెలంగాణ అనడంతో ఆమె టర్గెట్ ఎవరో అనేది అర్థం అవుతుందని ప్రరిశీలకులు అంటున్నారు.అధికారంలో ఉన్న పార్టీ టీఆర్ యస్ కాబట్టి దాన్నే టార్గట్ చేయాలనే నిర్ణయానికి ఆమె వచ్చినట్లు తెలుస్తుంది. ఎన్నికలలో టీఆర్ యస్ ఇచ్చిన హామీలను నెరవేర్చిందా అని ప్రశ్నించారు. తెలంగాణ పేదలు సంతోషంగా ఉన్నారా ? అని అడిగారు. ప్రజలకు చేయాల్సినవన్నీ ప్రభుత్వం చేస్తుందా ?అని అన్నారు .తెలంగాణాలో ఉన్న సమస్యలన్నిటిపై మాట్లాడదామని అన్నారు. రాజన్న స్వరం యుగం మల్లి తెచుకుందామన్నారు. వేదికపై కొండా రాఘవరెడ్డి ఒక్కరు మాత్రమే ఆసీనులైయ్యారు . పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరైయ్యారు.
ఆమెది ఆంధ్ర ప్రాంతం అని వస్తున్నా వాదనలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఆమె తెలంగాణ కోడలు అని ఆమె భర్తది హైద్రాబాద్ అయినందున ఇక్కడ ఆడపడుచుగా ఆమెకు అన్ని హక్కులు ఉన్నాయని అనుయాయులు అంటున్నారు. ఆమె పార్టీ ప్రకటన వచ్చే లోపే అన్ని జిల్లాల నాయకులతో సమావేశాలు పెట్టాలా లేక ఆయా జిల్లాలో పర్యటనలు చేయాలా అనే ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అనేక మంది ప్రముఖులు ఆమెను కలిశారు. వైయస్ హయాంలో సీఎం పేషీలో పనిచేసిన ప్రభాకర్ రెడ్డి, ఉదయసింహ అనే ఉన్నతాధికారుల సేవలు ఉపయోగించుకుంటారని ప్రచారం జరుగుతుంది. రెడ్డి సంక్షేమసంఘం తమ మద్దతు షర్మిలకు ప్రకటిస్తున్నట్లు ప్రకటించింది.అనేక కులసంఘాల నాయకులూ , సామజిక సంఘాల వారు షర్మిలతో భేటీ అవుతున్నారు.

Related posts

ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన దేశపతి….!

Drukpadam

కేసీఆర్ తరచుగా ప్రశాంత్ కిశోర్ తో కలుస్తున్నారు: రఘునందన్ రావు

Drukpadam

ఆంధ్రా కాంగ్రెస్ సమావేశాలకు …. చిరంజీవి రాడు …కిరణ్ వస్తాడో లేదో తెలియదు…

Drukpadam

Leave a Comment