Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాజీనామా చేసి దళితుడికి ముఖ్యమంత్రి ఇవ్వు …కేసీఆర్ కు షబ్బీర్ అలీ సలహా!

రాజీనామా చేసి దళితుడికి ముఖ్యమంత్రి ఇవ్వు …కేసీఆర్ కు షబ్బీర్ అలీ సలహా!
అప్పుడు నా సలహా ఇంతే ఇప్పుడు కూడా విని దళితుడికి సీఎం పదవి అప్పగించాలి
నా సలహాలు వింటున్నట్టు కేసీఆర్ నటిస్తున్నారు షబ్బీర్ అలీ
కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే
దళితుడిని సీఎం చేయలేదనే విషయాన్ని ఒప్పుకున్నారు
దళిత సీఎం గురించి ఎప్పుడు మాట్లాడుకున్నామో కేసీఆర్ చెప్పాలి

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి దళితుడికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని సీనియర్ కాంగ్రెస్ నేత మాజీమంత్రి షబ్బీర్ అలీ కేసీఆర్ కు సలహా ఇచ్చారు. గతంలో నేను ఇచ్చిన సలహా మేరకే ఆయన దళితున్ని ముఖ్యమంత్రి చేయలేదనే కేసీఆర్ చెప్పడంపై స్పందించారు. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలేనని ఆయన పేర్కొన్నారు. తాను కేసీఆర్ ను ఎప్పడు కలిసి సలహా ఇచ్చానో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పుడు మాటలు మాట్లాడటం వాటిని సమర్దిన్చుకోవడం కేసీఆర్ కే చెల్లిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని షబ్బీర్ అలీ మండిపడ్డారు. మేమే కేసీఆర్ ను దళితుడిని ముఖ్యమంత్రిని చేయనివ్వలేదని షబ్బీర్ అలీ చెప్పారంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై షబ్బీర్ మండిపడ్డారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చలేదనే విషయాన్ని కేసీఆర్ సిగ్గులేకుండా ఒప్పుకున్నారని అన్నారు.

అయితే, ఈ వ్యవహారంలో తన పేరును లాగడం సరికాదని చెప్పారు. అసలు దళిత ముఖ్యమంత్రి గురించి ఇద్దరం ఎప్పుడు మాట్లాడుకున్నామో చెప్పాలని కేసీఆర్ ను ప్రశ్నించారు. తాను ఇచ్చే సలహాలను వింటున్నట్టు కేసీఆర్ నటిస్తున్నారని మండిపడ్డారు. మీరు చెప్పిన మాటల్లో నిజం ఉంటే… తన సలహాలను మీరు వినేటట్టయితే… వెంటనే సీఎం పదవికి రాజీనామా చేసి, దళితుడికి ముఖ్యమంత్రి బాధ్యతలను అప్పగించాలని అన్నారు. ఇది జరగకపోతే మీరు చెప్పే మాటలను ఎవరు విశ్వసించరని అన్నారు. దళిత ముఖ్యమంత్రిని చేయవద్దని నేను కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎప్పడు అనలేదని స్పష్టం చేశారు. దళితులను ముఖ్యమంత్రులను చేసిన చరిత్ర కాంగ్రెస్ దని అలంటి కాంగ్రెస్ పార్టీ దళితులను ముఖ్యమంత్రులను చేయవద్దని అంతుందా ? అని షబ్బీర్ అన్నారు.

Related posts

ఆరోగ్య‌శ్రీ జ‌గ‌న్‌ది కాదు.. ప్ర‌ధాని మోదీది: బీజేపీ అధ్యక్షుడు జేపీ న‌డ్డా!

Drukpadam

దేశంలో విప్లవాత్మక మార్పులు రావాలి …నాగలి పట్టే చేతులే శాసనాలు చేయాలి … నాందేడ్ లో  కేసీఆర్ !

Drukpadam

హెల్మెట్ లేకుండా బైక్ తీస్తే కేసే…హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సీరియస్ వార్నింగ్!

Drukpadam

Leave a Comment