Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో ముగిసిన సీఎం జగన్ భేటీ!

 

  • ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో ముగిసిన సీఎం జగన్ భేటీ
    -ఇందుకోసం భువనేశ్వర్ వెళ్లిన జగన్
    -రెండు రాష్ట్రాల మధ్య సానుకూల వాతావరణం
    -సమస్యల పరిష్కరానికి రెండు రాష్ట్రాల సీఎస్ ల ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు
    -నేరడి, జంఝావతి, కొఠియా గ్రామాల అంశాలపై చర్చ
    -రెండు రాష్ట్రాల చర్చలు ఫలప్రదంగా ముగిశాయన్న జగన్ ,నవీన్ పట్నాయక్

 

ఎన్నో సంవత్సరాలుగా ఏపీ ,ఒడిశా మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని ఉద్దేశంతో ఏపీ సీఎం జగన్ ,ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో మంగళవారం భువనేశ్వర్ లో భేటీ అయ్యారు. ఇరువురు నేతల రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ భేటీలో పలు అంశాలపై చేర్చించారు. రాష్ట్రాలమధ్య చాలాకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు రెండు రాష్ట్రాల సీఎస్ ఆధ్వరంలో కమిటీ ఏర్పాటు చేయాలనీ ఇరువురు సీఎం లు నిర్ణయాలు. ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు.

 

భువనేశ్వర్ లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. సీఎం జగన్ ప్రధానంగా మూడు అంశాలపై నవీన్ పట్నాయక్ తో చర్చించారు. వంశధార నదిపై నేరడి వద్ద ఆనకట్ట, జంఝావతి ప్రాజెక్టు, సరిహద్దులోని కొఠియా గ్రామాలే అజెండాగా ఈ సమావేశం జరిగింది. సమస్యల పరిష్కారానికి ఉభయ రాష్ట్రాల సీఎస్ లతో జాయింట్ కమిటీ వేయాలని ఇరువురు సీఎంలు నిర్ణయించారు. ఈ మేరకు సీఎం జగన్, నవీన్ పట్నాయక్ సంయుక్త ప్రకటన చేశారు.

రెండు రాష్ట్రాల చర్చలు ఫలప్రదంగా ముగిశాయని వెల్లడించారు. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటున్నాయని తెలిపారు.

“కొఠియా గ్రామాలు, నేరడి బ్యారేజి, జంఝావతి ప్రాజెక్టుపై చర్చించాం. సరిహద్దు సమస్యలు, నీటి వనరులు, పోలవరం, బహుదా జలాల విడుదల, విద్యుత్ అంశాలు, బలిమెల, సీలేరు విద్యుత్ ప్రాజెక్టులు, ఆంధ్రా-ఒడిశా బోర్డర్ లో వామపక్ష తీవ్రవాదం, గంజాయి సాగు, శ్రీకాకుళం అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఒడిశా పీఠం ఏర్పాటు, అదే సమయంలో బరంపురం వర్సిటీలో తెలుగు పీఠం ఏర్పాటు, సరిహద్దు గ్రామాల్లో టీచర్ల నియామకం, పుస్తకాల పంపిణీ తదితర అంశాలపై చర్చించాం” అని సీఎంలు తమ ప్రకటనలో వెల్లడించారు.

 

Related posts

కేన్సర్ సోకిన చిన్నారుల కోసం టర్కీ ఆసుపత్రి కొత్త ప్రయత్నం!

Drukpadam

 ఒక్కో వాచీ ఖరీదు రూ. 2 కోట్లు.. గిఫ్ట్‌గా ఇచ్చిన అనంత్ అంబానీ..

Ram Narayana

ఆబ్కారీ ఎస్సైని.. చితకబాదిన మందుబాబులు

Drukpadam

Leave a Comment