Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక… అవకాశం ఎవరికీ ?

ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక… అవకాశం ఎవరికీ ?
-తుమ్మల ,పొంగులేటి , బాలసాని ,పాయం , గాయత్రీ రవి , వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ తో ఆశావహుల జాబితా
-మంత్రి పువ్వాడ మదిలో ఎవరున్నారు … సీఎం ఎవరిని ఫైనల్ చేస్తారు
-మళ్ళీ బాలసానికి ఛాన్స్ ఉంటుందా ? తుమ్మల కు అవకాశం ఉంటుందా ?
-పొంగులేటి ఆశక్తి చూపుతున్నారా? గాయత్రికి ఖమ్మం కరణ ఉంటుందా ?
-ఢిల్లీ సభకు వెళ్లాలనుకున్న వంకాయలపాటి హైద్రాబాద్ సభకు వెళతారా ?
-బీసీకి అవకాశం ఇస్తారా ? ఎస్సీ ,ఎస్టీలకు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా?

ఉమ్మడి ఖమ్మం జిల్లానుంచి స్థానికి సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగాల్సివుంది….ప్రస్తుతం స్థానికసంస్థల ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పదవికాలం జనవరి 4 తో ముగుస్తుంది. జిల్లాలో తుమ్మల ,పొంగులేటి , బాలసాని ,పాయం , గాయత్రీ రవి , వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ లాంటి వారు చట్టసభల్లో ప్రవేశం కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎవరి వైపు మొగ్గుచూపుతారు ? ఆయన మదిలో ఎవరున్నారు ?? అనే ఆశక్తి నెలకొన్నది .ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక స్వయంగా కేసీఆర్ చేయనున్నందున జిల్లా మంత్రిగా పువ్వాడ అభిప్రాయం తీసుకున్నా ఆయన చెప్పిన పేరునే ఎంపిక చేస్తారా ? లేదా అనేది సందేహమే .చివరకు కేటీఆర్ ,కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఫైనల్ చేస్తారు . ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ సీటు అధికార పార్టీ గెలుచుకోవడం పెద్ద కష్టం కాదు …కాకపోతే అభ్యర్థి ఎంపికే కొంచం ఇబ్బందికరంగానే ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఎవరిని ఎంపిక చేయాలనే విషయం కత్తిమీద సాములాంటిదే …గతంలో అధికార పార్టీకి చెందిన బాలసాని లక్ష్మి నారాయణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఎన్నికైయ్యారు. ఆయన పదవి కాలం జనవరి 4 తో ముగుస్తుంది. దీంతో తిరిగి స్థానికసంస్థల నుంచి ఎమ్మెల్సీ ని ఎన్నుకోవాల్సి ఉంది. దీనికోసం కేంద్ర ఎన్నికల సంఘం షడ్యూల్ కూడా విడుదల చేసింది. దీంతో అధికారపార్టీలో అభ్యర్థి ఎవరు అవుతారు అనే చర్చ నడుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నిక కొంత వ్యయం తో కూడుకున్నదే అయితే ఈసారి అధికార టీఆర్ యస్ కు తిరుగులేని మెజార్టీ స్థానిక సంస్థల్లో ఉన్నందున అభ్యర్థి గెలవడం సునాయాసమే . కాకపోతే అభ్యర్థి ఎవరు అనేది తేలాల్సివుంది. ఎమ్మెల్సీ పదవి కోసం అరడజన్ మంది ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక అయినందున సీఎం కేసీఆర్ స్వయంగా చూస్తున్నారు. ఇప్పటికే ఆయన మదిలో కొన్ని పేర్లు ఉన్నాయి. ఇంటలిజన్స్ రిపోర్టులు , జిల్లా అవసరాలు , పార్టీకి ఉపయోగపడే వారు ఎవరు అనేది సీఎం చూడనున్నారు.

జిల్లాలో తుమ్మల ,పొంగులేటి , బాలసాని ,పాయం , గాయత్రీ రవి , వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ లే కాకుండా ఆర్జేసీ కృష్ణ , డాక్టర్ మట్టా దయానంద్ ,తెల్లం వెంకట్ రావు ,తాటి వెంకటేశ్వర్లు , మదన్ లాల్ లాంటి వారుకూడా ఏమో ఏమైనా మాకు తగలక పోతుందా అనే ఆశతో ఉన్నారు ఉన్నది ఒక్క ఎమ్మెల్సీ డజన్ల పేర్లు ఉన్నాయి. వీరిలో ఎవరికీ అవకాశం దక్కుతుంది. ఎవరిని ఎంపిక చేయనున్నారు. మంత్రి ఛాయస్ ఎవరు ? మంత్రి ఎవరి పేరు సిఫార్స్ చేస్తారు . బాలసానికి మరోసారి అవకాశం ఇస్తారా ?మంత్రి మదిలో ఎవరున్నారు . కేసీఆర్ ఆశీస్సులు ఎవరికీ ఉంటాయి ? అనే ఆశక్తి నెలకొన్నది .

ఉమ్మడి జిల్లాలో మెజార్టీ పంచాయతీలు, ఎంపీటీసీలు జడ్పీటీసీలు , కౌన్సిలర్లు , కార్పొరేటర్లు , అధికార టీఆర్ యస్ పార్టీకి చెందినవారే ఉన్నారు . మిగతా పార్టీల సంఖ్య నామమాత్రమే . అయితే స్థానిక సంస్థల్లో పోటీ చేయాలా వద్ద అనే విషయంలో మిగతా పార్టీల్లో సందిగ్థత నెలకొన్నది . కాంగ్రెస్ పార్టీ నుంచి మేళం శ్రీనివాసరావు పోటీచేసేందుకు సిద్దపడుతున్నారు. అందుకు ఆయన పీసీసీకి ప్రత్యేకంగా విజ్ఞప్తి కూడా చేసుకున్నారు. ఓడిపోయే సీట్లో పోటీలో ఉండటం పై కాంగ్రెస్ పార్టీ మల్ల గుల్లాలు పడుతుంది.

Related posts

జలవివాదంపై ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు…

Drukpadam

చంద్రబాబును దీవించాలంటూ నోరు జారిన తెలంగాణ మంత్రి!

Drukpadam

శశిథరూర్ తో నన్ను పోల్చొద్దంటున్న మల్లికార్జున్ ఖర్గే!

Drukpadam

Leave a Comment