Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

హరీష్ రావు కు ప్రభుత్వం లో పెరుగుతున్న భాద్యతలు …ప్రజల్లో తగ్గుతున్నక్రేజ్!

హరీష్ రావు కు ప్రభుత్వం లో పెరుగుతున్న భాద్యతలుప్రజల్లో తగ్గుతున్నక్రేజ్!
ఒకప్పుడు హరీష్ అంటే వెంట పరిగెత్తే జనం
ఇప్పుడు ఆయన వేస్తున్న అడుగులపై సందేహాలు
ఉద్యమకారుల గొంతుకగా ఉంటాడను కున్న వైరిలో నైరాశ్యం
దుబ్బాక ,హుజురాబాద్ లో భాద్యతలురెండు చోట్ల టీఆర్ యస్ ఓటమి
ఓడిపోయేచోట్లనే ఆయనకు భాద్యతలు అప్పగిస్తున్నారనే ప్రచారం

హరీష్ రావు తెలంగాణ ఉద్యమంలో ముందుపీఠిన నిలిచిన నాయకుల్లో ఒకరు ….ఆరడుగుల ఆజాను భాహుడు పిలిస్తే పలుకుతాడనే పేరున్న మాస్ లీడర్ గా గుర్తింపు పొందారు … మాటల్లో స్పష్టత …చేతల్లో లక్ష్యం …మంచి వ్యూహకర్తగా , ఎత్తుగడలు వేయడంలో దిట్టగా పేరున్నవాడు ….కేసీఆర్ అడుగుజాడల్లో ఉద్యమాన్ని ఉరకలు పెట్టించిన వ్యక్తిగా ఉద్యమకారులకు వెన్నుదన్నుగా ఉండి వారిలో ఒకరుగా మెలిగినవాడు … తెలంగాణ కోసం అనేక ఢక్కామొక్కీలు తిన్నవ్యక్తిగా తెలంగాణ లో ప్రజలు ఆయన్ను ఆదరిస్తారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కు ఉన్నంత క్రేజ్ హరీష్ కు ఉంది. మంచి డైనమిక్ లీడర్ … తనకు అప్పగించిన పనులను చక్కపెట్టడంలో నేర్పరి . ఒకరకంగా చెప్పాలంటే ట్రబుల్ షూటర్ గా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు . కేసీఆర్ తరువాత అంత చరిష్మా ఉన్న నాయకుడు…. కానీ నేడు మసకబారిపోతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 2018 ఎన్నికల తరువాత కేసీఆర్ హరీష్ రావు కు ప్రాధాన్యత బాగా తగ్గించారు. మొదట విడత మంత్రి వర్గ విస్తరణలో ఆయన కు అవకాశం కూడా రాలేదు … దానికి రకరకాల కారణాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే కేటీఆర్ కు కూడా ఇవ్వలేదు …హరీష్ కు ఇవ్వనందునే కేటీఆర్ కు ఇవ్వలేదనే అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తం అయ్యాయి.

హరీష్ రావు కు ఉద్యమకాలంలో ఉన్న క్రేజ్, పాపులరటీ కొంతకాలం వరకు ఉన్నా క్రమేణ తగ్గుతుంది. మొదటిసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు హరీష్ రావు ,కేటీఆర్ లలో ఎవరు అంటే మొదట హరీష్ రావు నే గుర్తించేవారు .నేడు అది లేదు … నెంబర్ టు గా ఉండాల్సిన హరీష్ రావు ప్రస్తుతం త్రీ లో కూడా లేడనే అభిప్రాయాలే ఉన్నాయి. నెంబర్ టు గా లేదా సీఎం కేసీఆర్ కు సమాంతరంగా కేటీఆర్ రంగంలోకి వచ్చారు. హరీష్ రావు సైడ్ ట్రాక్ అయ్యారు. పార్టీలోనూ , ప్రభుత్వంలో ఆయన పట్టు తగ్గింది. చివరకు ఆయన మంత్రిత్వ శాఖపై కూడా ఆయనకు అజమాయిషీ అంతంత మాత్రమే అనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు అదనంగా వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు అప్పగించారు. అంటే ఆర్థిక శాఖతో పాటు మరో శాఖ చూడాల్సి ఉంది. హుజురాబాద్ ఎన్నికలో టీఆర్ యస్ ఓడిపోయినతరువాత హరీష్ రావు ను ప్రగతి భవన్ వివిఐపి కేటగిరినుంచి తొలగించారని పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఆతరువాత రెండు మూడు రోజులకే కేసీఆర్ ప్రెస్ మీట్ లో ఎప్పుడు లేంది హరీష్ రావు సీఎం కేసీఆర్ పక్కన కూర్చున్నారు. రెండు రోజుల ప్రెస్ మీట్లో ఇదే సీన్ దర్శనమిచ్చింది. మరుసటి రోజు అధికారికంగా వైద్య ఆరోగ్య శాఖను కూడా హరీష్ కు అప్పగించారు. ప్రభుత్వ పరంగా హరీష్ బాధ్యతలు పెరిగాయి. ప్రజల్లో క్రేజ్ మాత్రం తగ్గింది. హరీష్ రావు ను ఉద్యమకాలం నాటి హరీష్ లా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు . కానీ ఆయన మాత్రం ఎందకో లోప్రొఫైల్ మైంటైన్ చేస్తున్నారు.

దుబ్బాక ,హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భాద్యతలు హరీష్ రావు కు అప్పగించారు కేసీఆర్ . రెండు చోట్ల టీఆర్ యస్ ఓటమి చవిచూసింది . అధికారంలో ఉన్న పార్టీకి వరస ఓటములు పెద్ద మైనస్. అందులో హరీష్ రావు లాంటి డైనమిక్ లీడర్ మంచి వ్యూహకర్త భాద్యతలు తీసుకున్న చోట ఓటమి చెందడం హరీష్ అభిమానులను నిరుత్సహానికి గురిచేసింది. ఈ వరస ఓటములు హరీష్ రావు సమర్థతను మసక బారేలా చేశాయి. గతంలో ఆయనకున్న క్రేజ్ తగ్గింది…దీన్ని అధిగమించేందుకు హరీష్ రావు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిందే మరి !

Related posts

తెలంగాణకు వైఎస్ కుటుంబం వ్యతిరేకం: కడియం శ్రీహరి!

Drukpadam

రాజకీయాల్లో మార్పుకోసం పీకే పాదయాత్ర …జనం లేక వెలవెల …

Drukpadam

ఏపీ లో జడ్పీ చైర్మన్లు ఫైనల్ …సీఎం జగన్ మార్క్ ఎంపిక!

Drukpadam

Leave a Comment