Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పెరిగిన ఓటింగు శాతం… అధికార పార్టీకి ఎదురుగాలి…

పెరిగిన ఓటింగు శాతం… అధికార పార్టీకి ఎదురుగాలి…
-బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి పై నెల్లికుదురు లో దాడి
-ఇది టీఆర్ యస్ కార్యకర్తలు పనే అంటున్న బీజేపీ
-చికిత్సకోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
-కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న ఖమ్మం పోలీసులు
-సీఎల్పీ నేత భట్టి నిరసన

తెలంగాణాలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగు శాతం పెరిగింది.ఏది ఎవరికీ ప్లస్ ఎవరికీ మైనస్ అనేది ఆయారాజకీయపార్టీలు లెక్కలు వేస్తున్నాయి. అధికార పార్టీకు ఎదురుగాలి వీస్తుందనే అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి. ఇంకా ఓటింగు శాతం పై కచ్చితమైన సమాచారం లేకపోయినప్పటికీ ఖమ్మం ,నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల స్థానంలో సాయంత్రానికి 74 శాతం వరకు పాలైనట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి . 5 లక్షల5 వేల 565 ఓట్లకు గాను 3 లక్షల74 వేల 117 ఓట్లు పోలైయ్యాయి. ఇంకా ఫైనల్ శాతం ప్రకటించాల్సిఉంది. అక్కడక్కడా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి పై టీఆర్ యస్ కార్యకర్తలు దాడి చేసినట్లు బీజేపీ ఆరోపించింది.ఆయన్ని చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రేమేందర్ రెడ్డి పై దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఖమ్మంలో అక్కడక్కడా కొంత ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కాంగ్రెస్ కు చెందిన నరేందర్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవటం తో కాంగ్రెస్ కార్యకర్హలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎల్పీ నేత భట్టి పోలీస్ చర్యలను నిరసించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు సైతం జనరల్ ఎన్నికలను తలపించాయి. అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వవించారు. అధికార పార్టీ సైతం కంగు తీనే విధంగా పోలింగ్ జరగటంతో అభ్యర్థుల భవితవ్యం పై విశ్లేషణలు జరుగుతున్నాయి. అధికార పార్టీ నుంచే క్రాస్ ఓటింగ్ జరిగిందనే ప్రచారం జరుగుతుంది. పార్టీలోని పెద్దనాయకులు సైతం పార్టీ అభ్యర్థిని ఓన్ చేసుకోలేదని తెలుస్తుంది.కొంత మంది నాయకులూ పైకి ప్రచారం చేసినప్పటికీ అంటి ముట్టనట్లు వ్యవహరించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. డబ్బు పంపకాలు , ప్రజల్లో ప్రచారం జరగటం తో తమకు అందలేదని అందువల్ల తాము వారికీ ఎందుకు ఓట్లు వేయాలని కొందరు వ్యతిరేకంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. నియోజకవర్గాల వారీగా ఓట్లు ఆయా అభ్యర్థులకు చీలిపోయాయని అంటున్నారు. అధికార పార్టీ అభ్యర్థికి అనుకంగా లేకపోవడం ప్రభుత్వ విధానాలు ,అభ్యర్థి పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాలలో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు , ఇతర ప్రజాప్రతినిధులు గట్టి పట్టుదలతో పనిచేశారు. అవి ఫలితాలను ప్రభావితం చేస్తాయా ?లేదా చూడాల్సిఉంది . ప్రధానంగా పోటీలో ఉన్న అభ్యర్థులలో కోదండరాం, పల్లా రాజేశ్వర్ రెడ్డి , జయసారధిరెడ్డి , బీజేపీకి చెందిన ప్రేమేందర్ రెడ్డి , తీన్మార్ మల్లన్న , డాక్టర్ చెరుకు సుధాకర్ లు ఫొటీలో ఉన్న ప్రధానంగా మొదటి ఇద్దరి మధ్య పోటీ కొనసాగే ఆవకాశాలు తోసిపుచ్చలేమని పరిశీకులు అంటున్నారు.
హైదరాబాద్ రంగారెడ్డి ,మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎన్నికల్లో సైతం అధికార పార్టీ కి అంత అనుకూలంగా ఓట్లు పోలు కాలేదనే అభిప్రాయాలే ఉన్నాయి. కేసీఆర్ చివరనిమిషంలో ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే జరగలిసిన వ్యతిరేక ప్రచారం జరిగింది. అందువల్ల ఫలితాలపై ఆశక్తి నెలకొన్నది.

Related posts

వైఎస్ వంటి నేతను నా జీవితంలో చూడలేదు: అక్బరుద్దీన్ ఒవైసీ…

Drukpadam

విజయమో …వీరస్వర్గమో …యుద్దభూమిలోనే అంటున్న తుమ్మల…!

Drukpadam

కడప జిల్లా రాజకీయాల్లోకి మరో వైయస్ కుటుంబసభ్యుడు …డాక్టర్  అభిషేక్ రెడ్డి …

Drukpadam

Leave a Comment