Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అమరావతి రైతుల మహాపాదయాత్రలో పోలీసుల లాఠీచార్జ్.. విరిగిన రైతు చెయ్యి..

అమరావతి రైతుల మహాపాదయాత్రలో పోలీసుల లాఠీచార్జ్.. విరిగిన రైతు చెయ్యి.. 

  • ప్రకాశం జిల్లా చదలవాడ వద్ద ఉద్రిక్తత
  • రైతులను ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు
  • తాళ్లు, చెక్ పోస్టులు పెట్టి బంధనాలు
  • తోసుకుంటూ ముందుకెళ్లిన రైతులు  
  • లాఠీలు ఝళిపించిన పోలీసులు
Police Lathi Charge On Amaravati Farmers Pada Yatra

‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరిట మహాపాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులపై పోలీసులు లాఠీలు ఝళిపించారు. ప్రస్తుతం రైతుల మహాపాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. వారి యాత్ర నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్దకు చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. యాత్రకు అనుమతి లేదంటూ నిలువరించారు. ఈ క్రమంలో రైతులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. సంతనూతలపాడుకు చెందిన నాగార్జున అనే రైతు చెయ్యి విరిగింది. ఈ క్రమంలో రైతులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు.

మరోవైపు రైతుల పాదయాత్రకు స్థానికులూ సంఘీభావం ప్రకటించారు. అయితే, రైతులు వేరే ప్రాంతాల్లో ప్రవేశించకుండా చెక్ పోస్టులను పెట్టి, ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అయినా కూడా రైతులు ముందుకే కదులుతున్నారు. ఆంక్షల నడుమనే పాదయాత్ర చేస్తున్నారు. ఏపీకి అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.


వ‌ర్షంలోనూ పాద‌యాత్ర‌.. అమ‌రావ‌తి రైతుల ఇబ్బందులు..

  • ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో వర్షం
  • గొడుగులు, రెయిన్‌కోట్లు ధరించి రైతుల పాద‌యాత్ర‌
  • నాగులుప్పలపాడు మార్గాల్లో పోలీసుల చెక్‌పోస్టులు
  • రైతులు బస చేసిన గుడారాలు వాన‌కు తడిసిపోయిన వైనం
amaravati farmers padayatra going on
అమరావతి రాజ‌ధాని రైతులు చేస్తోన్న‌ మహా పాదయాత్ర కొన‌సాగుతోంది. రాజధాని రైతులు, మహిళలు ఈ రోజు వర్షాన్ని సైతం లెక్క చేయ‌కుండా పాద‌యాత్ర‌లో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో వర్షం కురుస్తుండ‌డంతో గొడుగులు, రెయిన్‌కోట్లు ధరించి రైతులు పాద‌యాత్ర‌లో పాల్గొన్నారు.


అయితే, నాగులుప్పలపాడు మార్గాల్లో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయ‌డం గ‌మనార్హం. అలాగే, త‌మ‌కు మ‌ద్ద‌తు తెలపడానికి వస్తున్న ప‌లువురిని పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గ‌త‌ రాత్రి రైతులు బస చేసిన గుడారాలు వాన‌కు తడిసిపోవ‌డంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తామ‌ని రైతులు చెబుతున్నారు. వారి పాద‌యాత్ర వ‌చ్చేనెల‌ 15న తిరుపతిలో ముగుస్తుంది.

Related posts

వామ్మో స్కూల్ ఫీజ్… ఏడాదికి కోటి 34 లక్షలు…!

Drukpadam

తారతమ్యాలు లేకుండా జర్నలిస్ట్ లకు ఇండ్ల స్థలాలు..జిల్లా అధ్యక్షులు మధుగౌడ్..

Drukpadam

సోనియా విజ్ఞ‌ప్తికి ఓకే చెప్పిన‌ ఈడీ… కొత్త తేదీల‌తో జారీ కానున్న‌ స‌మ‌న్లు!

Drukpadam

Leave a Comment