Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా…

టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ కు ఆస్ట్రేలియా దూసుకుపోయింది. పాకిస్థాన్ తో జరిగిన సెమి ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా సంచలన విజయం సాదించింది. పాకిస్థాన్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా మరొక ఒవర్ మిగిలి ఉండగానే విజయం సాదించింది. మెుదట్లో ఆస్ట్రేలియా వెంటవెంటనే వికెట్లు పొగొట్టకున్నప్పటికి మిడిల్ ఆర్డర్ నిలకడగా ఆడి చివర్లో విజృంభించడంతో 5 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేదించింది. వాడే 17 బంతుల్లో 41 పరుగులు స్టోనిక్స్ 31 బంతుల్లో 40 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా విజయం సూనయాసం అయింది. ప్లేయర్ ఆప్ ద మ్యాచ్ గా మాథ్య వేడ్ ఎంపికయ్యారు. ఫైనల్ లో న్యూజిలాండ్ తో ఆస్ట్రేలియా తలపడనున్నది.

సెమీ ఫైనల్లో పాకిస్థాన్‌ జైత్రయాత్రకు ఆస్ట్రేలియా బ్రేక్‌ వేసింది. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గి సెమీస్‌కు చేరిన పాక్‌కు రెండో సెమీ ఫైనల్‌లో ఆసీస్‌ దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. పాకిస్థాన్‌ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఒక ఓవర్‌ మిగిలుండగానే ఛేదించి ఫైనల్లో అడుగుపెట్టింది. డేవిడ్ వార్నర్ (49; 30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), మార్కస్ స్టాయినిస్‌ (40; 31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. చివర్లో మాథ్యూ వేడ్‌ (41; 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడాడు. షాహీన్‌ ఆఫ్రిది వేసిన 19వ ఓవర్‌లో వేడ్‌ చివరి మూడు బంతులకు మూడు సిక్సర్లు బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. పాక్ బౌలర్లలో షాదాబ్‌ ఖాన్‌ నాలుగు వికెట్లు పడగొట్టినా ఆ జట్టుకి ఓటమి తప్పలేదు. షాహీన్ ఆఫ్రిది ఒక వికెట్ తీశాడు. ఆస్ట్రేలియా విజయంలో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన మాథ్యూ వేడ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

సిక్సర్లతో విరుచుకుపడ్డ వేడ్..

177 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన ఆసీస్‌కు తొలి ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ ఆరోన్‌ ఫించ్‌ (0)ని షాహీన్‌ ఆఫ్రిది వెనక్కి పంపాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన మిచెల్ మార్ష్‌ (28)తో వార్నర్ జతకట్టాడు. మార్ష్‌ కాస్త నెమ్మదిగా ఆడినా వార్నర్‌ ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇమాద్‌ వసీమ్‌ వేసిన 4 ఓవర్‌లో వార్నర్‌ ఒక సిక్స్‌, రెండు ఫోర్లు బాదాడు. దీంతో ఆ ఓవర్‌లో 17 పరుగులు వచ్చాయి. రవూఫ్ వేసిన తర్వాతి ఓవర్‌లో మార్ష్‌ సిక్స్‌, ఫోర్ బాదాడు. షాదాబ్‌ఖాన్‌ వేసినా ఏడో ఓవర్‌లో మిచెల్ మార్ష్‌.. అసిఫ్‌ అలీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన స్మిత్ (5) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. కొద్దిసేపటికే వార్నర్‌, మ్యాక్స్‌వెల్‌ (7) కూడా ఔటవ్వడంతో మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా మారింది. తర్వాత స్కోరు నెమ్మదించింది. ఈ క్రమంలో క్రీజులో నిలదొక్కుకున్న మార్కస్‌ స్టాయినిస్, మాథ్యూ వేడ్ గేర్లు మార్చి ఆడారు. ముఖ్యంగా వేడ్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. హసన్‌ అలీ వేసిన 18 ఓవర్‌లో సిక్స్‌, ఫోర్‌ బాదిన అతడు.. షాహీన్‌ వేసిన 19 ఓవర్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆ ఓవర్లో చివరి మూడు బంతులకు మూడు సిక్స్‌లు కొట్టి జట్టును ఫైనల్‌కు చేర్చాడు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ బ్యాటింగ్‌లో దుమ్మురేపింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. పాకిస్థాన్‌కు ఓపెనర్లు మహ్మద్‌ రిజ్వాన్‌ (67; 52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), బాబర్‌ అజామ్‌(39 : 34 బంతుల్లో 5 ఫోర్లు) శుభారంభం అందించారు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. మ్యాక్స్‌వెల్‌ వేసిన మూడో ఓవర్‌లో చెరో ఫోర్‌ కొట్టగా.. హేజిల్‌వుడ్ వేసిన ఐదో ఓవర్‌లో రిజ్వాన్ ఓ సిక్సర్ బాదాడు. ఈ క్రమంలో పాక్‌ 9 ఓవర్లకు 68/0తో నిలిచింది. ఈ క్రమంలోనే జంపా వేసిన పదో ఓవర్‌లో చివరి బంతికి బాబర్‌ అజామ్‌.. వార్నర్‌కి చిక్కాడు. అనంతరం ఫకార్‌ జమాన్‌(55; 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో జట్టు కట్టిన రిజ్వాన్ జోరు పెంచాడు. జంపా వేసిన వేసిన 12 ఓవర్‌లో వరుసగా సిక్స్‌, ఫోర్‌ బాదాడు. హేజిల్‌వుడ్ వేసిన 17వ ఓవర్‌లో రిజ్వాన్‌ ఫోర్‌, సిక్సర్‌ బాదగా.. జమాన్‌ కూడా సిక్స్‌ బాదాడు. దీంతో ఈ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. స్టార్క్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో రిజ్వాన్‌.. స్మిత్‌కి చిక్కాడు. అయితే జమాన్‌ ఏ మాత్రం జోరు తగ్గించలేదు. అదే ఓవర్లో ఫోర్‌, సిక్స్ కొట్టాడు. 19 ఓవర్‌లో అసిఫ్‌ అలీ (0), చివరి ఓవర్‌లో షోయబ్‌ మాలిక్ (1) వెనుదిరిగారు. ఆఖరి ఓవర్‌లో ఫకార్‌ జమాన్‌ రెండు సిక్స్‌లు బాదడంతో పాక్‌ భారీ స్కోరు సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ రెండు, కమిన్స్‌, జంపా తలో వికెట్ తీశారు.

Related posts

సిగరెట్ తాగుతూ 42 కిలోమీటర్ల పరుగు.. చైనా వ్యక్తి రికార్డు!

Drukpadam

మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ పర్యాటకులకు ద్వారాలు తెరుస్తున్న చైనా!

Drukpadam

ఎట్టకేలకు పిన్నెల్లి సోదరులపై పోలీసుల రౌడీషీట్?

Ram Narayana

Leave a Comment