Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలనీ ధర్నాలతో దద్దరిల్లిన తెలంగాణ!

టీఆర్ యస్ పిలుపు మేరకు ధర్నాలతో దద్దరిల్లిన తెలంగాణ!
కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాల్సిందే అనే డిమాండ్
అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు
తెలంగాణ అంటే ఏమిటో చుపితామన్న కేటీఆర్
రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శలు
ఉద్యమాలతో కేంద్రం మెడలు వంచుతామని ఘాటు హెచ్చరిక
తెలంగాణను కేంద్రం అన్ని రకాలుగా మోసం చేసిందన్న హరీష్
కేసీఆర్ వేట మొదలు పెట్టాడు అది అతి భయంకరంగా ఉంటుందన్న పువ్వాడ

తెలంగాణలో పండిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలన్న డిమాండ్ తో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ మహా ధర్నాలకు శ్రీకారం చుట్టింది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్, సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు, ఖమ్మంలో పువ్వాడ అజయ్, కరీంనగర్ లో గంగుల కమలాకర్, నర్సంపేటలో ఎంపీ మాలోతు కవిత తదితరులు ఆందోళనల్లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లు కొననంటూ డ్రామాలాడుతోందన్నారు.
ఇక, సిరిసిల్లలో జరిగిన ధర్నాలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. పంజాబ్ లో పండిన వడ్లను కొంటూ తెలంగాణలో పండిన ధాన్యాన్ని మాత్రమే కేంద్రం కొనమంటోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వద్దంటేనే తామూ వరి వేయొద్దంటున్నామని చెప్పారు. కేంద్రం వడ్లు కొనేదాకా ఈ ఉద్యమం సాగుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రం వచ్చి ఏడున్నరేళ్లవుతున్నా కేంద్రం నుంచి అందిన సాయం ఏమీ లేదన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అడిగినా ఇవ్వలేదన్నారు. ఏపీలో కడుతున్న పోలవరానికి, కర్ణాటకలో కడుతున్న మరో ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇచ్చినా మన ప్రాజెక్టుకు మాత్రం ఇవ్వలేదన్నారు. చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయ పథకానికి రూ.5వేల కోట్లు ఇవ్వాల్సిందిగా నీతి ఆయోగ్ సూచించినా.. ఐదు పైసలు కూడా ఇవ్వలేదని కేటీఆర్ మండిపడ్డారు. కరీంనగర్ ఎంపీ అయిన దగ్గర్నుంచి బండి సంజయ్.. సిరిసిల్లకు చేసిందేమీ లేదని విమర్శించారు.
కొత్త రాష్ట్రం కదా అని ఇన్నాళ్లూ ఓపిక పట్టామని, కొత్త సంసారంలో సర్దుకుపోదామన్న ఉద్దేశంతో ఆగామని, ఇకపై మనమేంటో కేంద్రానికి చూపించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉద్యమాలు చేసి.. కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణను సాధించిన తమకు.. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడం అసాధ్యమేమీ కాదన్నారు. ఉద్యమాల ద్వారా కేంద్రం దిగొచ్చేలా చేద్దామని స్పష్టం చేశారు. ఇది ఆరంభం మాత్రమేనని, ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని ఆయన అన్నారు.

 

ఖమ్మం ధర్నా లో ఎంపీ నామ మాజీ ఎంపీ పొంగులేటిలతో కలిసి పాల్గొన్న మంత్రు పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ ఇక కేసీఆర్ వేట మొదలైందని అది ఎంత భయంకరంగా ఉంటుందో కాచుకోవాలని బీజేపీ కి సవాల్ విసిరారు. బీజేపీ  అంటేనే… భారతీయ ఝూటా పార్టీ..ఢిల్లీ పెద్దల్లారా ..
అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా ! అని మండి పడ్డారు

పైకి దేశ భక్తి..! లోపల కార్పోరేట్ భక్తి…!!బీజేపీ  నేతల్లారా.. ఇదేనా మీద్వంద్వ నీతి.. ఇపుడు బయటపడింది మీ బుద్ధి అనిధ్వజమెత్తారు    .

 

Related posts

నాగార్జున సాగర్ ఉపఎన్నికలో రికార్డ్ స్థాయిలో 88 శాతం పోలింగ్

Drukpadam

కమలహాసన్ రాజకీయాలకు గుడ్‌బై చెప్పేస్తున్నారా?

Drukpadam

తెలంగాణ బడ్జెట్ 2,56,958 కోట్లు.. బడ్జెట్ హైలైట్స్ – 1

Drukpadam

Leave a Comment