Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేంద్రం వడ్లు కొనాల్సిందే …ఖమ్మం వీధుల్లో ఎడ్లబండ్లపై మంత్రి పువ్వాడ ప్రదర్శన!

కేంద్రం వడ్లు కొనాల్సిందే …ఖమ్మం వీధుల్లో ఎడ్లబండ్లపై మంత్రి పువ్వాడ ప్రదర్శన!
-ఎడ్ల బండిపై ధర్నా చౌక్ కు మంత్రితోపాటు వచ్చిన నామ ,పొంగులేటి
-బీజేపీ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లిన ధర్నా చౌక్
-స్వయంగా నినాదాలు ఇచ్చిన మంత్రి పువ్వాడ
-జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు పాల్గొన్న -ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు

కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, తెలంగాణలో పండిన వరిధాన్యాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెరాస రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఖమ్మం నియోజకవర్గ కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా నిర్వహించారు.
ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డ్స్ ప్రదర్శన.. నినాదాలతో ధర్నా ప్రాంగణం హోరెత్తింది . ధర్నా ప్రాంగణానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎంపీ నామ నాగేశ్వర రావు ,మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఎడ్ల బండిపై ధర్నా ప్రాంగణానికి వచ్చారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరి పనలతో స్వయంగా మంత్రి పువ్వాడ నినాదాలు చేశారు..

డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, సూడా చైర్మన్ విజయ్, అన్ని డివిజన్ల కార్పొరేటర్లు, రైతులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు..

 

సత్తుపల్లి లో సండ్ర ,మధిరలో కమల్ రాజ్ ,వైరా లో ఎమ్మెల్యే రాములు నాయక్
కొత్తగూడెం లో వనమా ,ఇల్లందులో హరిప్రియ , కుసుమంచిలో కందాల,అశ్వారావు పేటలో మాజీమంత్రి తుమ్మల , ఎమ్మెల్యే మెచ్చ ,మణుగూరులో రేగా , భద్రాచలం లో తెల్లం వెంకట్ రావు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ ఖమ్మం లో మాట్లాడుతూ..కళ్లుండి చూడలేని.. చెవులు ఉంది వినలేని బిజెపి ప్రభుత్వం కు రైతుల ఉసురు తగలకపోదన్నారు.తెలంగాణలో పల్లెరు కాయలు కూడా మొలవవని అన్న భూముల్లో రెండు పంటలు పండుతున్నాయి అంటే అది కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ యస్ ప్రభుత్వ సూపరిపాలనకు నిదర్శనమన్నారు.

తెలంగాణ కు ఒక న్యాయం … పంజాబ్ కు ఒక న్యాయమా..? తెలంగాణ భారతదేశంలో భాగం కాదా…? అని ప్రశ్నించారు. తెలంగాణ రైతులు పండించిన వరి ధ్యాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొనదని, తెలంగాణ రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎఫ్ సి ఐ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతుల పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఎందుకు ఇంత కక్ష అని ఆయన ప్రశ్నించారు .

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని లేకుంటే మీకు పుట్టగతులు ఉండవన్నారు. తెలంగాణ రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొంటుందా … ? కొనదా…? స్పష్టం చేయాలన్నారు.. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయమంటే.. కార్లు ఎక్కించి చంపుతారా…? ఇది ఎక్కడి న్యాయం..? అని వ్యాఖ్యానించారు.

బీజేపీ అంటేనే… భారతీయ ఝూటా పార్టీ..ఢిల్లీ పెద్దల్లారా ..అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా ! వరి ధాన్యం కొనకుండా వంచిస్తారా..? అని ప్రశ్నించారు.పైకి దేశ భక్తి..! లోపల కార్పోరేట్ భక్తి…!! బీజేపీ నేతల్లారా.. ఇదేనా మీద్వంద్వ నీతి.. ఇపుడు బయటపడింది మీ బుద్ధి అని అన్నారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని, రైతులను వంచించడమే దేశ భక్తా…! సిగ్గు..సిగ్గు .! రాష్ట్ర బీజేపీ నేతలకు తెలంగాణ రైతులపై ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి వరి ధాన్యాన్ని కొనిపించాలి అని సవాల్ విసిరారు..

ధర్నాలో పాల్గొన్న ఎంపీ నామ నాగేశ్వర్ రావు మాట్లాడుతూ ….

రైతన్నలను ఆర్థికంగా బలోపేతం చెయ్యడమే , మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస పార్టీ ముఖ్య లక్ష్యం అని తెరాస లోక్ సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర రైతాంగం పై కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో శుక్రవారం రైతు ధర్నాలు జరిగాయి. ఇందులోభాగంగా ఖమ్మం, పాలేరు నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన రైతు ధర్నా కార్యక్రమంలో ఎంపీ నామ నాగేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు.  ఈ సందర్భంగా ఎంపీ నామ మాట్లాడుతూ… గత ఏడు సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం ప్రవేశ పెట్టని అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం నిలిచిందన్నారు. భారత దేశంలోనే నెంబర్ వన్ పంటలు పండించిన రాష్ట్రం తెలంగాణననేనని అన్నారు . ప్రతి సంవత్సరం మన రాష్ట్ర రైతులు 3 కోట్ల క్వింటాల వరి ధాన్యాన్ని పండిస్తున్నారని పేర్కొన్నారు. కానీ ఆ పంట ను కొనేందుకు రైతు వ్యతిరేక బీజేపీ ప్రభుత్వం ముందుకు రావడం లేదని విమర్శించారు. 14 నెలల క్రితం కేంద్రం ప్రవేశ పెట్టిన మూడు బిల్లు లను చూసి అందులో ఉన్న విధివిధానాలు రైతు సోదరులకు వ్యతిరేకంగా ఉన్నాయని గమనించి తెరాస పార్టీ లోక్ సభ పక్ష నేతగా తెరాస పార్టీకి చెందిన ఎంపీ లతో పాటుగా ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంపీలను కలుపుకుని ఆ మూడు బిల్లులను వ్యతిరేకిస్తూ పార్లమెంటు లోన, బయట ధర్నాలు చెయ్యడంతో పాటు రాజ్యసభ ను వాకౌట్ చేయడం జరిగిందన్నారు. అలాగే తెలంగాణ రైతాంగం పండిస్తున్న వరి ధాన్యాన్ని కొనాలి అని కేంద్ర ప్రభుత్వం మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్,రాజ్ నాథ్ సింగ్, పీయూష్ గోయల్ లను నాలుగు సార్లు తెరాస పార్టీ తరుపున, మన రాష్ట్ర సీఎం కేసీఆర్, మన రాష్ట్ర ఎంపీ లు అందరూ కలిస్టే ధాన్యం కొంటాము అని హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు.  పాలేరు నియోజలో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి తో కలిసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెరాస రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబీ స్వర్ణకుమారి, జిల్లా నాయకులు చిత్తారు సింహాద్రి యాదవ్, నామ సేవా సమితి బాద్యులు పాల్వంచ రాజేష్, చీకటి రాంబాబు, రేగాళ్ల కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు….

సత్తుపల్లిలో

 

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష వైఖరి పట్ల నిరశన తెలుపుతూ  ముఖ్యమంత్రి కెసిఆర్  పిలుపు మేరకు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య రైతులతో వరి దుబ్బులు పట్టుకొని సత్తుపల్లిలో ధర్నా నిర్వహించారు. సందర్బంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.
రైతు పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలుచేస్తున్న కార్యక్రమాలు రైతు కుటుంభాల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు. రైతు బంధు, రైతు భీమా, రైతు ఋణమాఫీ, మద్దతు ధరకు ధాన్యం కొనుగోలుతో పాటు ఎస్ఆర్ఎస్పి, కాళేశ్వరం, సీతా రామ ప్రాజెక్టుల నిర్మాణంతో రైతులకు కేసీఆర్ గారి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఇలాంటి పథకాలు తెలంగాణలో తప్ప దేశంలోని ఏ రాష్ట్రంలో లేవన్నారు. ఒక వైపు రాష్ట్రం రైతుకు అండగా ఉంటే మరో వైపు రైతు వ్యతిరేక కార్యక్రమాలతో కేంద్రంలోని బిజేపీ ప్రభుత్వం రైతు కుటుంబాలను నడ్డి విరిచే ప్రయత్నం చేస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలో పూర్తిగా కాణి కింద పడేసిందన్నారు. వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ముమ్మాటికి కేంద్రంపై ఉందని, అయితే కేంద్రంలోని బిజేపీ ప్రభుత్వం బాధ్యత నుండి తప్పుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. కార్పోరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్న బిజేపీ ప్రభుత్వం రైతు విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు.

మధిరలో లింగాల …

 

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా మరియు తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మధిర నియోజకవర్గ కేంద్రం మధిర లోని తహసీల్దార్ కార్యాలయంలో వద్ద మధిర నియోజకవర్గ తెరాస పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలసి నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో జడ్పీ చైర్మన్, తెరాస మధిర నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నందు ఎమ్మెల్యే కందాళ ఆధ్వర్యంలో నిరసన తెలిపిన తెరాస నాయకులు,రైతులు…

కూసుమంచి మండలం పాలేరు చెరువు కట్ట వద్ద పాలేరు నియోజకవర్గం రైతులు,ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు,అభిమానులతో కలిసి పాలేరు శాసన సభ్యులు శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్యపూరిత వైఖరికి నిరసన తెలిపారు.

Related posts

కాంగ్రెస్ హైకమాండ్ పై అసమ్మతి నేత కపిల్ సిబాల్ మరోసారి ఫైర్…

Drukpadam

తెలంగాణకు ప్రత్యేక జెండా.. అధికారిక గీతంగా ‘జయజయహే తెలంగాణ’: రేవంత్​ రెడ్డి

Drukpadam

ఉండవల్లి శ్రీదేవికి ఇది నా వ్యక్తిగత సలహా: డొక్కా మాణిక్యవరప్రసాద్

Ram Narayana

Leave a Comment