Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖనిజ సంపదను దోచుకుపోయేందుకే పోలీస్‌ బేస్‌ క్యాంపు…మావోయిస్టు పార్టీ

ఖనిజ సంపదను దోచుకుపోయేందుకే పోలీస్‌ బేస్‌ క్యాంపు

-ఈ చర్యలను ప్రజలంతా ఐక్యంగా వ్యతిరేకించాలి
-మావోయిస్టు పార్టీ తెలంగాణా రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్‌ పిలుపు

ఆదివాసీలను అడవుల నుండి తరిమి గొట్టి వారి ఖనిజ సంపదను తరలించకపోయి లాభాలు గడిరచడానికే చెన్నాపురం, పూసుగుప్పలో పోలీస్‌ క్యాంపులను నిర్మించ తలపెట్టారని, తక్షణమే ఈ చర్యలను ప్రజలంతా ఐక్యమై తీవ్రంగా వ్యతిరేకించాలని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. భధ్రాద్రీ కొత్త గూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం గ్రామం వద్ద ఇటివలి పోలీస్‌ బేస్‌ క్యాంపు నిర్మాణానికి భూమి పూజ చేసి యుద్ధ ప్రాతిపాదికన పనులు చేపట్టారని, త్వరలో మరో క్యాంపు పూసుగుప్పలో వేయడానికి సన్నాహాలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ చర్యలను ప్రతిఘటించాలని, ఆదివాసీలకు అండగా నిలిచి వారి అస్థిత్వాన్ని కాపాడాలని కోరారు. గత నలుబై యేండ్లుగా అన్ని వర్గాల పీడిత ప్రజలతోపాటు ఆదివాసీలతో మమేకమై ప్రజల రాజకీయ అధికారం కోసం, అదివాసీల స్వయం ప్రతిపత్తి కోసం సాగుతున్న పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న సిపిఐ (మావోయిస్టు)ని సంపూర్ణంగా నిర్మూలించడం ద్వారా దోపిడి పాలక వర్గాలు భూస్వామ్య, పెట్టుబడిదారుల, సామ్రాజ్యవాదుల ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి పోలీసు క్యాంపుల నిర్మాణాలు త్వరితగతిన చేపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. వీటి ద్వారా అనేక తరాలుగా అడవులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మూలవాసీ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి బలవంతంగా వెళ్ళగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. జల్‌, జంగల్‌, జమీన్‌పై పూర్తి హక్కులపై అధికారం కార్పోరేట్‌ సంస్థలు పట్టు సాధించి ఆదివాసీల అస్థిత్వం లేకుండా చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. ఆదివాసీల ఆచార సంప్రదాయాలు, వారి జీవన విధానం పూర్తిగా ద్వంసం చేస్తున్నారని, జనతనా సర్కార్ల నాయకత్వంలో కొనసాగుతున్న ప్రజల రాజకీయ అధికారాన్ని వినాశనం చేయదలిచారని పేర్కొన్నారు. తద్వారా కార్పోరేట్‌, బహుళజాతి సంస్థలు ఇక్కడ తిష్ఠవేసి ఆదివాసీల సంపదను ఎలాంటి ఆటంకాలు లేకండా కొల్లగొట్టే కుట్ర పూరిత పథకాలు రచిస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే చెన్నాపురం, పూసుగుప్ప గ్రామాలలో బేసు క్యాంపుల నిర్మాణాలు చేపడుతున్నారని, అంతే కాకుండా ఈ పోలీసు క్యాంపుల మూలంగా పల్లెల్లో ప్రజలు భయంతో కాలం వెళ్ళదీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సామ్రాజ్యవాదుల ప్రయోజనాలను కాపాడే పోలీసు క్యాంపుల నిర్మాణాలను తక్షణమే ఎత్తివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆదివాసీ ప్రాంతాలలో 5వ, 6వ షెడ్యూల్డ్‌, పెసా చట్టాల క్రింద అదివాసీలకు పూర్తి అధికారాలు కల్పించాలని, ఈడిమాండ్లను సాధించుకునే వరకు ఆదివాసీ ప్రజలతో పాటు అన్నీ వర్గాల ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. బస్తర్లో తమ అస్థిత్వం కోసం పోలీసు క్యాంపులను వ్యతిరేకిస్తూ ఆదివాసీలు యాడది కాలంగా విరామం లేకండా పోరాడుతున్నారని, వారికి తమ సంపూర్ణ మద్దతును తెలియచేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Related posts

యూపీలో అల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్..యూ పీ పోలిసుల మీద నమ్మకం లేదన్న అఖిలేశ్ -అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం…

Drukpadam

పేదల భాదలు వింటూ ,రైతుల కష్టాలు తెలుసుకుంటూ పీపుల్స్ మార్చ్ లో ముందుకు సాగుతున్నభట్టి…

Drukpadam

విద్యుత్ చార్జీల పెంపును ఉపసంహరించుకోండి :సీఎల్పీ నేత భట్టి

Drukpadam

Leave a Comment