Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

విద్యార్థులు పోరాటాల్లో ముందు ఉండాలి…మనోహర్ రాజు

విద్యార్థులు పోరాటాల్లో ముందు ఉండాలి
పీడీఎస్ యూ రాజకీయ శిక్షణ తరగతుల్లో మనోహర్ రాజు

 

విద్యార్థుల సమా జాన్ని శోధించి సమాజంలో ఉన్నటువంటి అసమనతం పై నిరంతరం పోరాడాలని అటువంటి పోరాటాల్లో ముందుండాలని ప్రధాన నాయకత్వం వహించే దశకు చేరుకోవాలని టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి వి. మనోహర్ రాజు విద్యార్థులకు పిలుపునిచ్చారు.పీడీఎస్ యూ రాష్ట్ర రాజకీయ తరగతులు శుక్రవారం ఖమ్మంలోని రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభమయ్యాయి.

ఈ క్లాసులు వి.మనోహర్ రాజు ప్రారంభిస్తూ నేటి పాలకుల వర్గాలు గత పాలకుల కంటే భిన్నంగా పచ్చిగా దోచుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం అందరికీ మంచి విద్య పేరుతో నూతన విద్యా విధానం నేప్ ని తెచ్చింది. కానీ నీ విద్యాసంస్థల్లో ఎలాంటి మౌలిక వసతులు కల్పించకుండా విద్యా విద్యకు అధిక బడ్జెట్ కేటాయించకుండా ఎన్ని నూతన చట్టాలు తెచ్చిన అందరికీ విద్య అందదు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేట్ కార్పొరేట్ కు అమ్ముతున్నారని ప్రతిఘటించిన వారిని దేశ ద్రోహులుగా జాతి వ్యతిరేకులుగా నిర్బంధ ఇస్తున్నది నేప్ కి వ్యతిరేకంగా రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ సంస్థలైన బిఎస్ఎన్ఎల్ విశాఖ ఉక్కు పరిశ్రమ లను ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా జె ఎన్ యూ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు ఇటువంటి సమస్యలను విద్యార్థులు వెంటనే ఆకలింపు చేసుకుని వీటికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలి అటువంటి పోరాటంలో విద్యార్థులు ముందు ఉండాలిని వారు అన్నారు.

జెండా ఆవిష్కరణ ఉదయం 10 గంటలకు సంస్థాగత జెండా అయిన బిగి పిడికిలి జెండాను పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షులు జూపాక శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం పీడీఎస్ యూ అమరవీరులకు పీడీఎస్ యూ రాష్ట్ర కార్యదర్శి బోయినపల్లి రాము సంతాపం ప్రకటించారు ఈ క్లాసులలో రాష్ట్ర నలుమూలల నుండి కార్యకర్తలు,విద్యార్థులు హాజరయ్యారు రాష్ట్ర ఉపాధ్యక్షులు శరత్, నాగేశ్వరరావు, సాగర్, ఆజాద్, రామకృష్ణ, సహాయ కార్యదర్శులు గణేష్, కల్పన మహేష్ ,మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

పార్టీలు ఫిరాయించడంలో గోవా ఎమ్మెల్యేల రికార్డు!

Drukpadam

చంద్రబాబు కుట్రలో భాగమే రాష్ట్రపతికి లేఖ :ఎంపీ మిధున్ రెడ్డి…

Drukpadam

తెలంగాణలో అమిత్ షా ఆపరేషన్ …ఈనెల 15 ఖమ్మంలో సభ …!

Drukpadam

Leave a Comment