Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణలో అమిత్ షా ఆపరేషన్ …ఈనెల 15 ఖమ్మంలో సభ …!

తెలంగాణలో అమిత్ షా ఆపరేషన్ …ఈనెల 15 ఖమ్మంలో సభ …!
బలహీనపడుతున్న బీజేపీకి బూస్ట్ ఇవ్వాలనే సంకల్పం
ఖమ్మం లో బీజేపీ అమిత్ షా పర్యటన పై రాజకీయవర్గాల్లో ఆసక్తి
ఇప్పటికే పొంగులేటి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు సంకేతాలు
ఖమ్మం సభ ఎలాంటి ఫలితాలు ఇస్తుందనే దానిపై ఉత్కంఠ

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అన్ని పార్టీలు ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. దీంతో అన్ని హంగులు ఉన్న బీజేపీ అందుకు తగ్గట్లుగానే ప్రణాళికలు రూపొందిస్తుంది. పార్టీ అగ్రనేతలు అమిత్ షా ఈనెల 15 న ఖమ్మం కు రానుండగా , 25 న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా నగర్ కర్నూల్ లో జరిగే మహాజన సంపర్క్ అభియాన్ లో పాల్గొంటారు .

అమిత్ షా ఖమ్మంలో సభ పెట్టడానికి కారణమేమిటి …? ఇక్కడ పార్టీకి పెద్దగా పట్టుకుందా లేదు కదా ..? పోనీ పొంగులేటి లాంటి వారు చేరుతున్నారా అంతే అది కూడా లేదనే సంకేతాలు ఉన్నాయి. అయినప్పటికీ అమిత్ షా లాంటి పెద్ద నాయకుడు ఖమ్మం రావడానికి కారణం ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి. దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది . ఖమ్మం లో కూడా బీజేపీ గతంలో కన్నా కొంత పుంజుకున్నది . సీట్లు గెలవక పోయిన కొన్ని ఓట్లు సంపాదించే స్థాయికి చేరుకుంది. అయితే అమిత్ షా వస్తున్నారంటే పెద్ద సభ పెట్టాలి దానికి పెద్ద ఎత్తున జన సమీకరణ జరపాలి ఆశక్తి ఇక్కడ బీజేపీకి ఉందా…? అంటే సందేహమే …

సరే పేర్లు ఏవైనా టార్గెట్ అసెంబ్లీ ఎన్నికలే కానున్నాయి. అందుకు అధికార బీఆర్ యస్ తోపాటు అన్ని పార్టీలు వ్యూహాలు ,ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఎన్నికల వాతావరణం వచ్చింది. బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకోని రావాలని పార్టీ అధిష్టానం నాయకుల మధ్య సమన్వయం చేస్తూనే ప్రజల మధ్యకు వెళ్లాలని భావిస్తుంది. అందులో భాగంగానే అమిత్ షా వస్తున్నారని తెలుస్తుంది.

కొన్ని నెలల క్రితం వరకు రాష్ట్రంలో బీఆర్ యస్ కు ప్రత్యాన్మయం బీజేపీ అని ప్రజల్లో బలంగా ఉంది . దానికి తగ్గట్లుగానే కేంద్ర నాయకత్వం తెలంగాణ పై ఫోకస్ పెంచింది. ప్రధాని మోడీ మొదలుకొని , అమిత్ షా , నడ్డా తోపాటు అనేక మంది కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చారు . బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలు చేశారు . బీఆర్ యస్ బహిష్కృత నేత మాజీ మంత్రి ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డీకే అరుణ , జితేందర్ రెడ్డి లాంటి హామీ హేమీలు బీజేపీలో చేరడంతో ఇక రాష్ట్రంలో బీజేపీకి తిరుగులేదని అనుకున్నారు . కానీ కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ ప్రభావం రాష్ట్రంలో ఒక్కసారిగా తగ్గింది. కాగా కాంగ్రెస్ ఒక్కసారిగా పుంజుకుంది . అనేక మంది బీజేపీలో చేరాలని అనుకున్న నేతలు సైతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. అందువల్ల తిరిగి బీజేపీకి బూస్ట్ ఇవ్వలనే ఉద్దేశంతో అగ్రనేతలు తెలంగాణ కు క్యూకడుతున్నారు . అయితే పార్టీలో సమన్వయలోపం అంతర్గత కలహాలు ఇబ్బంది పెడుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న పార్టీ సమస్యలు అధిష్టానం దృష్టికి కూడా వెళ్లాయి. దీనిపై అందిస్తాం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది.

Related posts

కిర‌ణ్ కుమార్ రెడ్డి సేవ‌లు కాంగ్రెస్‌కు అవ‌స‌రం: ఏఐసీసీ సెక్ర‌ట‌రీ మ‌య్య‌ప్ప‌న్‌!

Drukpadam

‘ఆర్ఎస్ఎస్’పై సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలను తప్పుబట్టిన ఒవైసీ!

Drukpadam

నారా లోకేశ్‌తో కైవ‌ల్యా రెడ్డి భేటీపై సోమిరెడ్డి స్పంద‌న!

Drukpadam

Leave a Comment