Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీలో ప్రమాదకరస్థాయిలో కాలుష్యం…

ఢిల్లీలో ప్రమాదకరస్థాయిలో కాలుష్యం…
కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం
ఢిల్లీలో కాలుష్య బీభత్సం
పాఠశాలలు వారం పాటు మూసివేత
ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్
లాక్ డౌన్ అంశాన్ని పరిశీలిస్తున్నామన్న సీఎం కేజ్రీవాల్

దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్నాళ్లుగా వాతావరణ కాలుష్యం ఏమాత్రం అదుపులోకి రావడంలేదు. ఇటీవల కొన్నిరోజులుగా కాలుష్య స్థాయి ప్రమాదకరస్థాయికి చేరడంతో సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో సాధారణ జనజీవనం సాధ్యం కాని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.

పాఠశాలలకు వారం రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఈ నెల 15 నుంచి వారం రోజుల పాటు ఆన్ లైన్ లో తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. అటు ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేయాలని పేర్కొంది. ప్రైవేటు సంస్థల ఉద్యోగులకు కూడా ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించాలని యాజమాన్యాలకు సూచించింది. అంతేకాదు, ఈ నెల 14 నుంచి 17 వరకు భవన నిర్మాణ పనులు నిలిపివేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సీఎం కేజ్రీవాల్ ఢిల్లీలో కాలుష్య తీవ్రతపై నేడు సమీక్ష జరిపారు. లాక్ డౌన్ విధించాలన్న సీజేఐ ఎన్వీ రమణ సూచనను పరిశీలిస్తున్నామని కేజ్రీవాల్ తెలిపారు. కేంద్రంతో చర్చించి లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

Related posts

పంత్ వైద్య చికిత్సకు అయ్యే ఖర్చును భరిస్తాం: ఉత్తరాఖండ్ సీఎం!

Drukpadam

ఇన్ఫీ మూర్తిని ఆకాశానికెత్తిన అల్లుడు రిషి సునాక్‌!

Drukpadam

ఏకంగా 70 కిలోమీటర్లు బైక్ పై ప్రయాణించిన కిషన్ రెడ్డి…

Drukpadam

Leave a Comment