Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఎన్నికల బరిలో సోనూసూద్ సోదరి.. ప్రకటించిన సోనూ.. ఎక్కడి నుంచంటే.. పంజాబ్ ఎన్నికల్లో పోటీ!

ఎన్నికల బరిలో సోనూసూద్ సోదరి.. ప్రకటించిన సోనూ.. ఎక్కడి నుంచంటే..
పంజాబ్ ఎన్నికల్లో పోటీ!
-మోగా నుంచి బరిలోకి
-ఏ పార్టీ నుంచన్నది త్వరలోనే ప్రకటిస్తామన్న సోనూ
-సీఎంను కలిశానని వెల్లడి
-ఆప్, శిరోమణీ అకాలీదళ్ లీడర్లనూ కలుస్తానని కామెంట్

ఎన్నికల్లో తన సోదరిని పోటీచేయించేందుకు సామజిక సేవకుడు సినీ యాక్టర్ సోను సూద్ సిద్ధపడ్డారు ఈ మేరకు ఆయన ప్రకటనకూడా చేసేడు . ఇది ఇప్పుడు పంజాబ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది.. పంజాబ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో సోదరి మాళవికా సూద్ పోటీచేస్తారని ప్రకటించారు.అయితే ఏ పార్టీ నుంచి అనేది ఆయన వెల్లడించలేదు. పంజాబ్ సీఎం ను కలిసిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. అయితే కాంగ్రెస్ నుంచి పోటీచేస్తారా ?అని విలేకర్లు ప్రశ్నించగా తాను అకాలీదళ్ , అప్ పార్టీల ను కూడా కలుస్తానని చెప్పడం కొసమెరుపు ..

తన సోదరి ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించడంతో రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. రాబోయే పంజాబ్ ఎన్నికల్లో మోగా నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తారని సోను సూద్ వెల్లడించారు. ఇవాళ తన సోదరి మాళవికా సూద్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించారు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, సరైన సమయంలో ఆ నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు.

ప్రజలకు సేవ చేసేందుకు మాళవిక సిద్ధమైందన్నారు. ఇటీవలే తాను రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీని కలిశానని, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్, శిరోమణీ అకాలీదళ్ అధ్యక్షుడు సుక్బీర్ సింగ్ బాదల్ నూ కలుస్తానని చెప్పారు. ఏ రాజకీయ పార్టీలో చేరాలన్నది సిద్ధాంతాలకు సంబంధించిన విషయమని, సమావేశాలతో అదయ్యేది కాదని తెలిపారు.

తాను రాజకీయాల్లోకి వస్తానా? రానా? అన్నది పక్కనపెట్టాలని, దానిపై తన నిర్ణయాన్ని తర్వాత ప్రకటిస్తానని చెప్పారు. ముందు మోగాలో మాళవికకు మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. ఆరోగ్య రంగమే ఆమెకు కీలకమని, గెలిస్తే కిడ్నీ పేషెంట్లకు ఉచితంగా డయాలిసిస్ సేవలను అందిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగిత సమస్యపైనా పోరాడుతుందన్నారు. ఉద్యోగం లేనప్పుడే యువత డ్రగ్స్ తీసుకుని చెడు దారులు తొక్కుతుందని అన్నారు.

Related posts

నారా లోకేశ్‌పై రాళ్ల దాడిలో ఎస్సై త‌ల‌కు తీవ్ర గాయం… మ‌రో కానిస్టేబుల్‌కూ గాయాలు

Drukpadam

నారా లోకేశ్‌తో కైవ‌ల్యా రెడ్డి భేటీపై సోమిరెడ్డి స్పంద‌న!

Drukpadam

ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమితో కమలంలో బేజారు…

Drukpadam

Leave a Comment