Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రోడ్డు పక్కన మహిళను చూసి కాన్వాయ్ ఆపించిన సీఎం జగన్… 

రోడ్డు పక్కన మహిళను చూసి కాన్వాయ్ ఆపించిన సీఎం జగన్… 

  • తిరుపతిలో జోనల్ కౌన్సిల్ సమావేశం
  • హాజరైన సీఎం జగన్
  • ఎయిర్ పోర్టు నుంచి తాజ్ హోటల్ కు వెళుతుండగా ఘటన
  • మహిళ నుంచి వివరాలు తీసుకున్న అధికారి 

ఎవరైనా పనికోసం వస్తే గ్రామ సర్పంచ్ కూడా తాను పనిలో ఉన్నాను రేపు రా అనడం మనం చూస్తున్నాం …కానీ ఏపీ సీఎం జగన్ తన కాన్వాయిని అపి ఓ ఎస్ డి ని పంపు ఒక యువతి దగ్గర ఉన్న వినతి పత్రాన్ని తీసుకున్నారు. ఆమె ఎందుకు కాన్వాయ్ వెంట పరుగెడుతుందో తెలుసుకున్నారు. ఆమె కు భరోసా ఇచ్చారు. దీంతో ఆ యువత సంతోషాన్ని వ్యక్తం చేశారు.స్వయాన ముఖ్యమంత్రి జగన్ కాన్వాయ్ ని ఆపి తన వినతిపత్రాన్ని తీసుకోవడం తో ఆమె ఉబ్బితబ్బిబ్బు అయిపోతున్నారు. గతంలో కూడా విశాఖ పర్యటనలో జగన్ విదేవిధంగా తనకోసం పరుగులు తీస్తున్న యువకుడి సమస్యని తెలుసుకొని సహాయం అందించారు.

తిరుపతిలో దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశానికి ఏపీ సీఎం జగన్ కూడా హాజరయ్యారు. కాగా, ఈ సమావేశానికి వెళ్లే క్రమంలో ఆయన ఓ మహిళ పట్ల స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతిలోని తాజ్ హోటల్ కు వెళుతుండగా, ఓ మహిళ చేతిలో పత్రాలతో కాన్వాయ్ వెంట పరిగెడుతుండడాన్ని సీఎం గమనించారు. దాంతో కాన్వాయ్ ఆపించి ఆ మహిళ సమస్య ఏంటో తెలుసుకోవాలని తన ఓఎస్డీని పంపించారు.

ఆమె పేరు విజయకుమారి. కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన మహిళ. అనారోగ్యంతో బాధపడుతున్నానని, కుటుంబ పోషణ కోసం ఏదైనా ఉపాధి చూపించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ఆమె నుంచి వివరాలు తీసుకున్న అనంతరం సీఎం జగన్ కాన్వాయ్ ముందుకు కదిలింది.

Related posts

కాంగ్రెస్‌లోకి కన్నయ్య, జిగ్నేష్ మేవాని.. ముహూర్తం ఖరారు!

Drukpadam

సీఎం జగన్ కు మరింత శక్తిని ప్రసాదించాలని భగవంతుడ్ని కోరుకుంటున్నా: సుమన్

Drukpadam

షర్మిల పై మంత్రి నిరంజన్ రెడ్డి వివిదాస్పద వ్యాఖ్యలు !

Drukpadam

Leave a Comment