సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో సీఎం జగన్ విజ్ఞప్తులకు అమిత్ షా సానుకూల స్పందన!
-తిరుపతిలో ముగిసిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం
-తిరుపతిలో దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం
-అమిత్ షా అధ్యక్షతన సమావేశం
-హాజరైన సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు
సుమారు 4 గంటల పాటు సమావేశం తూరుపతిలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రాలు ఎదురుకొంటున్న సమస్యలపై ఆయారాష్ట్రాల నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు వారి ప్రతినిధులు అమిత్ షా కు వివరించారు.దానిపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారు. ప్రధానంగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర విభజన ఏపీ జరిగిన నష్టాన్ని గురించి వివరించారు. ప్రత్యేకహోదా పోలవరం , తెలంగాణ నుంచి రావాల్సిన విద్యత్ బకాయిలు గురించి ప్రస్తావించారు. సమావేశంలో వివిధ రాష్ట్రాల ప్రతినిధులు వెలిబుచ్చిన అభిప్రాయాలపై అమిత్ షా సానుకూలత వ్యక్తం చేశారు. తొందరలో అన్ని సమస్యలపై కేంద్రం ద్రుష్టి సరిస్తుందని తెలిపారు. చివరగా ఆతిధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి విందు తో సమావేశం ముగిసింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన తిరుపతిలో నిర్వహించిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. దక్షిణాది సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరైన ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు చేసిన విజ్ఞప్తులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆలకించారు. ఏపీ సీఎం జగన్ కేంద్రానికి పలు విజ్ఞప్తులు చేశారు. సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలపై అమిత్ షా సానుకూలంగా స్పందించారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీకి నెలరోజుల్లో కార్యాచరణ రూపొందించేందుకు సమ్మతి తెలిపారు. రాష్ట్రంలో గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటుపైనా హామీ ఇచ్చారు. శిక్షణ కేంద్రానికి స్థలాన్ని కేటాయిస్తే, భవనాలు తామే నిర్మిస్తామని చెప్పారు. అటు గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు స్థలం మార్పును నోటిఫికేషన్ ద్వారా ప్రకటించాలని సీఎం జగన్ కోరగా, అమిత్ షా సానుకూలంగా స్పందించారు.