సిబిఐ ,ఈడీ అధిపతుల పదవి కాలం ఇకనుంచి ఐదేళ్లు …
-కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం
-ఇప్పటివరకు సీబీఐ, ఈడీ చీఫ్ ల పదవీకాలం రెండేళ్లు
-ఇకపై ఐదేళ్ల వరకు పెరగనున్న పదవీకాలం
-రెండు వేర్వేరు ఆర్డినెన్స్ లు తీసుకువచ్చిన కేంద్రం
-రాష్ట్రపతి ఆమోదం
-చట్ట సవరణలకు మార్గం సుగమం
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధిపతుల పదవీకాలంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా విభాగాల చీఫ్ ల పదవీకాలాన్ని గరిష్టంగా ఐదేళ్ల వరకు పొడిగించింది. ఈ మేరకు వేర్వేరుగా రెండు ఆర్డినెన్స్ లు తీసుకువచ్చింది. కేంద్రం సిఫారసు చేసిన ఈ ఆర్డినెన్స్ లకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు.
సీబీఐ, ఈడీ చీఫ్ లకు ఇప్పటివరకు రెండేళ్ల పదవీకాలం అమలుల్లో ఉంది. రెండేళ్ల పదవీ కాలం పూర్తయిన తర్వాత ఒక్కొక్కసారి ఒక ఏడాది చొప్పున, మొత్తం మీద ఐదేళ్ళ వరకు పొడిగించవచ్చునని ఈ ఆర్డినెన్సులు పేర్కొంటున్నాయి. పదవీకాలం పెంపు చట్టసవరణలకు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదం లభిస్తుందని కేంద్రం భావిస్తోంది. చట్ట సవరణ ఆయిన్ ఆవెంటనే పదవి కాలం పెంపు అమల్లోకి వస్తుంది. గతంలో రెండేళ్లకే ఉంది కేంద్రం పొడిగిస్తూ ఉండేది.