మహారాష్ట్ర మాజీ హోంమంత్రికి అరదండాలు…
-జ్యుడీషియల్ రిమాండ్ కు తరలింపు
-మనీలాండరింగ్ కేసులో 14 రోజుల రిమాండ్
-ఆహారాన్నే తీసుకోవాలని కోర్టు ఆదేశాలు
-జైల్లో బెడ్ ఏర్పాటు చేసేందుకు కోర్టు అనుమతి
పువ్వులు అమ్మిన చోటనే కట్టలు అమ్మాల్సి వస్తుంది అంటే ఇదేనేమో … మహారాష్ట్రలో ఒక వెలుగు వెలిగిన మాజీ హోమ్ మంత్రి కి అరదండాలు పడ్డాయి.అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలావాదేవీలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనను ఈడీ విచారణకు పిలిచింది అదుపులోకి తీసుకుంది.కోర్ట్ ముందు హాజరు పరిచింది. కోర్ట్ రెండు వారాలపాటు జ్యుడీషియల్ కస్టడీని విధించడం జరిగింది. తన అరెస్ట్ అక్రమమని తనకు ఇంటినుంచి ఆహరం తెచ్చుకొనే సదుపాయం కల్పించాలని కోరింది. వాటిని కోర్ట్ అంగీకరించలేదు . జైల్లో చిప్పకూడే తినాలని నిష్కర్షగా చెప్పింది. ఏమైనా సమస్యలు ఉంటె అప్పడు చూద్దామని కోర్ట్ తెలిపింది.
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ కు ముంబైలోని ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ కోర్టు షాకిచ్చింది. ఆయనకు రెండు వారాల పాటు జ్యుడీషియల్ కస్టడీని విధించింది. అయితే, ఇంటి నుంచి ఆహారాన్ని తెప్పించుకునేందుకు చేసుకున్న విన్నపాన్ని కోర్టు తిరస్కరించింది. జైలు ఆహారాన్నే తీసుకోవాలని ఆదేశించింది. జైల్లోని ఆహారం వల్ల ఏవైనా సమస్యలు వస్తే అప్పుడు చూసుకుందామని తెలిపింది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జైల్లో బెడ్ ఏర్పాటు చేసేందుకు అనుమతించింది.
ఈ నెల 2న మనీలాండరింగ్ కేసులో అనిల్ దేశ్ ముఖ్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈడీ కార్యాలయంలో విచారణ జరిపిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆయనపై సీబీఐ కూడా అవినీతి కేసు నమోదు చేసింది. అనిల్ దేశ్ ముఖ్ పై ముంబై మాజీ పోలీసు అధికారి పరంబీర్ సింగ్ రూ. 100 కోట్ల అవినీతి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఆయనపై కేసు నమోదైంది. చట్టం ముందు అందరు సమానమేనని సూత్రాన్ని ఎంతటి వారైనా పాటించాల్సిందే అని మాజీ హోమ్ మంత్రి విషయంలో కోర్ట్ చెప్పడం హర్షతి రేఖలు వ్యక్తం అవుతున్నాయి.