Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ధాన్యం కొనుగోళ్ల వివాదం … రేపు టీఆర్ఎస్ శాసనసభాపక్ష కీలక భేటీ!

ధాన్యం కొనుగోళ్ల వివాదం … రేపు టీఆర్ఎస్ శాసనసభాపక్ష కీలక భేటీ!
-ఢిల్లీ లో ధర్నాకు టీఆర్ యస్ ప్లాన్ !
-భవిషత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్
-సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న సమావేశం
-తెలంగాణలో ధాన్యం కొనుగోలు రగడ
-టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ
-రేపు సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ఎల్పీ సమావేశం
-హాజరుకానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ లు

ధాన్యం కొనుగోలు వ్యవహారం తెలంగాణ లో పెద్ద దుమారాన్నే రేపుతోంది. బీజేపీ ,టీఆర్ యస్ లమధ్య మాటల యుద్ధం నడుస్తుంది. తెలంగాణాలో ధాన్యం కేంద్రం కొనుగోలు చేయనని కేంద్రం చెప్పిందిన ఆరోపిస్తూ రాష్ట్రప్రభుత్వం తెలంగాణ వ్యాపితంగా నియోజకవర్గ కేంద్రాలలో ఆందోళనలు నిర్వహించింది. మంత్రులు ,ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , ఎంపీ లు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందే బీజేపీ తెలంగాణ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందంటూ రాష్ట్రంలో కలెక్టర్ కార్యాలయాలముందు ధర్నా నిర్వహించారు. ఒకరిపై మరొకరి ఆరోపణలు ప్రత్యారోపణలతో తెలంగాణాలో రాజకీయం వేడెక్కింది. సోమవారం బండి సంజయ్ నల్గొండ జిల్లా పర్యటన ఉద్రిక్తతగా మారింది. టీఆర్ యస్ ,బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. తన కాన్వాయ్ పై టీఆర్ యస్ దుండగులు దాడి చేశారని రాళ్ళూ ,కోడి గుడ్లు విసిరారని ఆరోపించారు . తీవ్ర ఉద్రిక్తతల నడుమ జరగనున్న టీఆర్ యస్ కీలక భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

ధాన్యం కొనుగోలు అంశం తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతోంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. వరి ధాన్యం కొనుగోలులో కేంద్రం ద్వంద్వ వైఖరిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రజలను బీజేపీ గందరగోళంలోకి నెడుతోందని ఆరోపిస్తున్న టీఆర్ఎస్ అధినాయకత్వం ఈ అంశాన్ని కూడా రేపటి భేటీలో చర్చించనుంది.

ఈ కీలక సమావేశానికి టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ హాజరు కావాలని ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. ధాన్యం కొనుగోలు అంశంపై ఢిల్లీలో ధర్నా చేపట్టాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ ఈ అంశంపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తమ్మీద ధాన్యం అంశంలో కేంద్రాన్ని, బీజేపీని ఎదుర్కొనేందుకు భవిష్యత్ కార్యాచరణను రేపటి సమావేశంలో ఖరారు చేయనున్నారు.

Related posts

సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ!

Drukpadam

జగన్ బెయిలు రద్దయితే ఏమవుతుందో చెప్పిన సీపీఐ నారాయణ!

Drukpadam

ఇంతమంది చనిపోయినా వైసీపీ ప్రభుత్వంలో చలనం లేదు: చంద్రబాబు

Drukpadam

Leave a Comment