Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రెండవ రోజు బండి సంజయ్ పై దాడి …సీఎం ప్రోద్బలంతోనే దాడులు సంజయ్

 బండి సంజయ్ పై దాడి …సీఎం ప్రోద్బలంతోనే దాడులు సంజయ్..,గవర్నర్ కు ఫిర్యాదు చేసిన బీజేపీ
-చింవ్వేంల వద్ద బండి సంజయ్ కాన్వాయ్ పై టీఆర్ యస్ దాడి
-సూర్యాపేట–ఖమ్మం హైవే పై కొద్దీ సేపు కార్ లోనే కూర్చున్న బండి సంజయ్
-బీజేపీ నేత రామచంద్రయ్య కార్ ధ్వంసం

-బీజేపీ ,టీఆర్ యస్ కార్యక్రథల బాహాబాహి …పలువురికి గాయాలు
-ముగ్గురు పోలీసులకు సైతం దెబ్బలు
-సంజయ్ పర్యటనలు అనుమతులు లేవంటున్న ఎస్పీ రంగనాథ్
-ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా సంజయ్ పర్యటనలు అనుమతి లేదు

-దాడులకు భయపడం …వానాకాలం వడ్లు కొనే దాక టీఆర్ యస్ ను వదిలి పెట్టాం
-మాపై జరిగిన దాడుల వెనుక కేసీఆర్ హస్తం ఉంది: బండి సంజయ్
-టీఆర్ఎస్ దాడుల్లో 8 వాహనాలు ధ్వంసమయ్యాయి
-మా షెడ్యూల్ ని పోలీసులకు ఇచ్చినా వారు పట్టించుకోలేదు
-శాంతిభద్రతల సమస్యను కేసీఆరే సృష్టిస్తున్నారు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లాల పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఆయన నల్గొండ జిల్లాలో పర్యటించారు. ఆయన పర్యటన ఆద్యంతం ఉద్రిక్తతల మధ్యనే కొనసాగింది. నిన్న చీకటి పడిన తర్వాత ఆయన కాన్వాయ్ పై దాడి కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు సూర్యాపేటలో మీడియాతో సంజయ్ మాట్లాడుతూ… తమపై దాడుల వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తం ఉందని ఆరోపించారు. ఈ దాడులకు సూత్రధారి కేసీఆరే అని చెప్పారు. రెండవ రోజు కూడా చింవ్వేంల వద్ద ఐకెపి కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన సంజాయిపై టీఆర్ యస్ కార్యకర్తలు దాడి జరిపారు. పెద్ద పెద్ద కర్రలను ఆటోలలో తీసుకుని వచ్చిన వారు సంజయ్ కాన్వాయ్ పై దాడి జరిపారు. బీజేపీ కార్యకర్తలకు టీఆర్ యస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది . దీనిపై రాష్ట్ర వ్యాపితంగా బీజేపీ నేతలు ఆందోళనలు చేపట్టారు .

తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని బండి సంజయ్ విమర్శించారు. తన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ని ముందుగానే పోలీసులకు ఇచ్చామని… అయినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని మండపడ్డారు. తమ పర్యటనను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. స్వయంగా ముఖ్యమంత్రే శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు.

వానాకాలం పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనేంత వరకు విడిచిపెట్టే ప్రసక్తే లేదని బండి సంజయ్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఫాం హౌస్ నుంచి బయటకు రావడం లేదని విమర్శించారు. సమస్యలను పరిష్కరించాలని వారే ధర్నాలకు దిగడం, దాడులకు పాల్పడటం దారుణమని అన్నారు. నిన్న టీఆర్ఎస్ చేసిన దాడిలో 8 వాహనాలు ధ్వంసమయ్యాయని చెప్పారు.

Related posts

తమిళనాట మరో వివాదం.. ‘దహీ’ పదం చుట్టూ లొల్లి!

Drukpadam

ఏ బాధ్యతలు అప్పగించినా పని చేస్తా: ఢిల్లీలో బండి సంజయ్

Ram Narayana

శాసనమండలి రద్దును వెనక్కి తీసుకుంటూ ఏపీ ప్రభుత్వ తీర్మానం!

Drukpadam

Leave a Comment