Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సొంతపార్టీ పైనే ధర్మాన చురకలు …ప్రభుత్వ పెద్దలకు అధికారుల తప్పుడు సలహాలు!

  • సొంతపార్టీ పైనే ధర్మాన చురకలు …ప్రభుత్వ పెద్దలకు అధికారుల తప్పుడు సలహాలు…
    -ప్రభుత్వ పనులు చేసినవారంతా నష్టపోతున్నారు: ధర్మాన ప్రసాదరావు
    -సిమెంట్, స్టీల్, ఇసుక ధరలు మండిపోతున్నాయి
    -పరువుకు పోయి పనులు చేపట్టి నిండా మునుగుతున్నవైసీపీ ప్రజా ప్రతినిధులు
    -ప్రభుత్వ పెద్దలకు అధికారులు తప్పుడు సలహాలు ఇవ్వొద్దు

ధర్మాన ప్రసాద్ రావు మాజీమంత్రి ,సీనియర్ నాయకులు వైసీపీ శ్రీకాకుళం ఎమ్మెల్యే గా ఉన్నారు .ఆయన కు జగన్ మంత్రివర్గంలో స్తానం లభిస్తుందని అందరు భావించారు. కానీ అందుకు విరుద్ధంగా ఆయన సోదరుడు మొదటి నుంచి వైసీపీ లో ఉన్న ధర్మాన కృష్ణ దాస్ కు జగన్ మంత్రివర్గంలో స్థానం కల్పించారు. జిల్లా నుంచి ఒకే మంత్రి పదవి ఇవ్వాల్సి రావడం అందులో ఒకే కుటుంబానికి ఇద్దరికీ మంత్రులుగా ఇవ్వడం సాధ్యం కాకపోవడంతో ధర్మాన ప్రసాద్ కు మంత్రి పదవి ఇవ్వడం కుదరలేదు. దీంతో ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన ఎమ్మెల్యే గా ఉన్నప్పటికీ ముభావంగా ఉన్నారు. ఇప్పుడు నేరుగా ప్రభుత్వ విధానాల వల్ల పనులు చేసిన వాళ్ళు నష్టపోతున్నారని కొందరు అధికారులు తప్పుడు సలహాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నదని చురకలు అంటించారు. ధర్మాన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉన్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి.

వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పనులు చేసిన వారంతా నష్టపోతున్నారని ఆయన అన్నారు. మార్కెట్ లో సిమెంట్, స్టీల్, ఇసుక ధరలు మండిపోతున్నాయని చెప్పారు. పరువుకు పోయి పనులను చేపట్టిన వైసీపీ ప్రజాప్రతినిధులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 

ప్రభుత్వం నిర్ణయించిన ఎస్ఎస్ఆర్ రేట్లు కూడా సరిగా లేవని అభిప్రాయపడ్డారు. మెప్పు కోసం ప్రభుత్వ పెద్దలకు అధికారులు తప్పుడు సలహాలు ఇవ్వొద్దని అన్నారు. అధికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని చెప్పారు. ఈ విషయాన్ని తాను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లానని అన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో పేదల జీవన ప్రమాణాలు దారుణంగా ఉన్నాయని ధర్మాన చెప్పారు. జిల్లా నుంచి వేలాది మంది ప్రజలు వలస వెళ్తున్నారని తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని సరిగా అమలు చేయలేక పోతున్నామని చెప్పారు. ధర్మాన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

Related posts

పొంగులేటికి రాజ్యసభ ఆఫర్ …నేడు కేటీఆర్ తో భేటీ అయిన పొంగులేటి!

Drukpadam

స‌భ‌లో ఏం మాట్లాడాలంటూ రాహుల్ ప్ర‌శ్న‌!… ట్రోలింగ్ మొద‌లెట్టేసిన టీఆర్ఎస్‌!

Drukpadam

మమతా బెనర్జీ కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ!

Drukpadam

Leave a Comment