మన పోచంపల్లి అంతర్జాతీయ ఉత్తమ పర్యాటక గ్రామం …
-పోచంపల్లి గ్రామానికి ఐక్యరాజ్యసమితి విశిష్ట గుర్తింపు
-సిల్క్ సిటీగా పేరొందిన పోచంపల్లి
-ప్రపంచంలో అత్యుత్తమ పర్యాటక గ్రామంగా గుర్తింపు
-వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డుకు ఎంపిక
-డిసెంబరు 2న స్పెయిన్ లో అవార్డు ప్రదానం
మన పోచంపల్లికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఉత్తమ అంతర్జాతీయ పర్యాటక గ్రామంగా నిలిచింది. ఇది మనగ్రామంగా ఉన్నందున తక్కువ అంచనా వేస్తున్నాం . కానీ చీరెల ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన గ్రామం గా అది నిలిచింది. వేలారకాల చీరెలు ఇక్కడ తయారు అవుతాయి. పోచంపల్లి అంగన్ చీరెల కేంద్రంగా గుర్తు వస్తుంది. అందుకే దానిపేరు అంతర్జాతీయంగా మారుమోగిపోతుంది. ఈగ్రామం తెలంగాణాలో ఉండటం తెలంగాణ ప్రజలకు గర్వకారణం .
తెలంగాణలో భూదాన్ పోచంపల్లికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ నేసే చీరలు ఎంతో నాణ్యమైనవిగా పేరుపొందాయి. ఇది గ్రామమే అయినా సిల్క్ సిటీగా గుర్తింపు పొందింది. ఇప్పుడా గ్రామం గుర్తింపు అంతర్జాతీయ స్థాయికి విస్తరించింది. తాజాగా పోచంపల్లి గ్రామాన్ని ఐక్యరాజ్యసమితి అత్యుత్తమ పర్యాటక గ్రామంగా గుర్తించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.
వచ్చే నెల 2న స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ నగరంలో జరిగే ఐరాస వరల్డ్ టూరిజం 24వ మహాసభల్లో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ప్రదానం చేయనున్నారు. భారత్ నుంచి ఈ అవార్డుకు మూడు గ్రామాలు రేసులో నిలిచాయి. అయితే సిల్క్ సిటీ పోచంపల్లి మిగతా గ్రామాలను వెనక్కి నెట్టి అరుదైన పురస్కారం సొంతం చేసుకుంది.