Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పోచారం మనవరాలి పెళ్లికి హాజరైన కేసీఆర్, జగన్

  • సీఎం జగన్ ఓఎస్డీ కుమారుడితో పోచారం మనవరాలి వివాహం
  • స్నిగ్ధ వెడ్స్ రోహిత్ రెడ్డి
  • శంషాబాద్ వీఎన్ఆర్ ఫార్మ్స్ లో వివాహ వేడుక
  • పక్కపక్కనే కూర్చుని పెళ్లి వేడుక తిలకించిన సీఎంలు

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలు స్నిగ్ధ వివాహం నేడు శంషాబాద్ లో రోహిత్ రెడ్డితో ఘనంగా జరిగింది. రోహిత్ రెడ్డి ఎవరో కాదు… ఏపీ సీఎం జగన్ వద్ద ఓఎస్డీగా విధులు నిర్వర్తిస్తున్న కృష్ణమోహన్ రెడ్డి కుమారుడే. ఈ వివాహ మహోత్సవానికి జగన్ తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు. వధూవరులు స్నిగ్ధ, రోహిత్ రెడ్డిలను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి శంషాబాద్ అవుటర్ రింగ్ రోడ్డులోని వీఎన్ఆర్ ఫార్మ్స్ వేదికగా నిలిచింది. కాగా, పెళ్లి వేడుక సందర్భంగా కేసీఆర్, జగన్ పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకోవడం కనిపించింది.

Related posts

పట్టుదల తో చదివాడు …నిరుపేద కుమారుడు కలెక్టర్ అయ్యాడు!

Drukpadam

నాకు ప్రాణహాని ఉంది…ఏం జ‌రిగినా సీఎం జ‌గ‌న్‌దే బాధ్య‌త!‌: వివేకా కేసు అప్రూవ‌ర్ దస్త‌గిరి!

Drukpadam

కరోనా మాటున మోడీ ప్రభుత్వంపెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం దుర్మార్గం

Drukpadam

Leave a Comment