Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఎమ్మెల్సీ ఎన్నికలకు అట్టహాసంగా నామినేషన్లు…

ఎమ్మెల్సీ ఎన్నికలకు అట్టహాసంగా నామినేషన్లు
-సాధారణ ఎన్నికలను తలపించిన ఎన్నికల ర్యాలీలు
-అధికార పార్టీ హడావుడి అధికంగా ఉంది.
-పల్లా రాజేశ్వర రెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంగించారంటున్న విపక్షాలు

ఎమ్మెల్సీ ఎన్నికలకు వివిధ పార్టీల అభ్యర్థులు ,స్వతంత్రులు అట్టహాసంగా నామినేషన్లు వేశారు.
కొందరు అభ్యర్థులు నిబంధనలు తుంగలో తొక్కారు. అధికార పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి నిబంధనలు పాటించలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. లక్ష 31 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న పల్లా రాజేశ్వరరెడ్డి ఎక్కడ ఇచ్చారో చెప్పాలని వామపక్షాల అభ్యర్థి జయసాదిరెడ్డి డిమాండ్ చేశారు. తాము రెండు ఎమ్మెల్సీ సీట్లు గెలిచి తీరుతామని అంటున్నారు బండి సంజయ్ తొడ కొడుతున్నారు. రానున్నది బీజేపీ సర్కారే నని ఘంటాపధంగా చెబుతున్నారు. ఎన్నికల నామినేషన్లు ముగియటంతో ,ఇక రంగంలో ఉన్న అభ్యర్థులు యుద్ధ క్షేత్రం లో కత్తులు దూసుకోవటమే మిగిలింది. ఇప్పటికే సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం జరుగుతుంది. అభ్యర్థులు సభలు ,సమావేశాలు,వీధి మీటింగ్ లు , ప్రదర్శనలు,పాదయాత్రలు జిల్లాలో పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఒక్క ఖమ్మం , నల్లగొండ , వరంగల్ ,పట్టభద్రుల నియోజవర్గంలోనే 4 లక్షల 91 వేల ఓట్లు ఉండగా ఓటర్లను కలుసుకునేందుకు అభ్యర్థులు నానాపాట్లు పడుతున్నారు. లోకసభ నియోజకవర్గంలో ఉన్నన్ని ఓట్లు ఎమ్మెల్సీకి ఉన్నాయి. అంటే కాదు . కొత్తగా ఏర్పడిన 12 జిల్లాల పరిధిలో ఓటర్లు ఉన్నారు. ఇంతమందిని ఎన్ని జిల్లాలు తిరిగి కలవటం కొంత ఇబ్బంది కరంగానే మారింది. అధికార టీఆర్ యస్ కు ,బీజేపీ ,కాంగ్రెస్ లకు , వామపక్షాలు మద్దతుతో పోటీచేస్తున్న అభ్యర్థికి మాత్రమే యాత్రంగం బాగా ఉంది. మిగతా వారిలో కోదండరాంకు సిపిఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ మద్దతు ఉన్నందున వారికీ కమిటెడ్ కార్యకర్తలు ఉన్నారు. ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ కు బీసీ సంఘాలు , మద్దతు ఇస్తున్నాయి. రాణి రుద్రమ తన సొంత పార్టీ ఉంది. ఇంకా చాలామంది పోటీలో ఉన్నప్పటికీ పెద్దగా ప్రభావం చూపే ఆవకాశం లేదు. కాంగ్రెస్ కు చెందిన రాములు నాయక్ తమపార్టీ యంత్రంగంతో పాటు తన సామాజిక వర్గంలోని యువకులపై ఆధారపడి ఉన్నారు. ఖమ్మం , నల్లగొండ , వరంగల్ జిల్లాలలో ఆయన సామాజిక వర్గం బలంగానే ఉంది. అంటే కాకుండా ఆయన పోటీచేస్తున్న నియోజకవర్గ పరిధిలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ,కోమటి రెడ్డి వెంకటరెడ్డి , ఎంపీలుగా , కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీతక్క , పొదెం వీరయ్య ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇక బలమైన నేత జానారెడ్డి , దామోదర్ రెడ్డి, కొండా సురేఖ , లాంటి నాయకులూ ఉన్నారు. అందువల్ల కాంగ్రెస్ ను కూడా తక్కువ అంచనా వేయటానికి వీల్ లేదు . అదే సందర్భంలో అధికార టీఆర్ యస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వర రెడ్డి పోటీలో ఉండటం ఆయనకు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు , ఎమ్మెల్సీలు , జడ్పీ చైర్మన్లు , డీసీసీబీ చైర్మన్లు , వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు కలిసొచ్చిన అంశంగా ఉంది. ఇప్పటికే అధికార పార్టీ హైద్రాబాద్ నుంచి అన్ని జిల్లాల నేతలతో మంత్రులతో ,ఎంపీలతో నిత్యం సమన్వయం చేస్తున్నారు. ఎట్టి పరిస్థిలో ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచితీరాలన్న పట్టుదలతో ఉన్న కేసీఆర్ అందుకు తగ్గట్లుగా వ్యూహరచన చేస్తున్నారు. పార్టీ నేతలు కదలికలు కూడా రహస్య గూఢచారుల ద్వారా సేకరిస్తున్నట్లు సమాచారం . వారు ఆయా జిల్లా కేంద్రాలలో మకాం వేసి నిత్యం హైద్రాబాద్ కు నివేదికలు అందజేస్తున్నట్లు తెలుస్తుంది. పార్టీలో ఉంటూనే ఏమైనా వెన్నుపోట్లు ,పక్క చూపులు ఏమైనా ఉన్నాయా ? అనే దానిపై కూడా అరా తీస్తున్నారు. ఈసారి ఆరు నూరైనా ఎమ్మెల్సీలుగా పార్టీ అభ్యర్థులు మంచి మైజార్టీ తో గెలిపించాల్సిన బాధ్యతను మంత్రులమీద పెట్టారు .ఆయా జిల్లాలలో బీజేపీ కూడా పకడ్బందీ వ్యూహంతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంది.బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ప్రేంమేందర్ రెడ్డి అన్ని జిల్లాలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ నిత్యం తగు సూచనలు చేస్తూ వారికీ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుంది. పట్టభద్రులలో బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఉందని ఆపార్టీ నమ్ముతుంది. అందుకనుగుణంగా ఎత్తులు వేస్తుంది. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ విషయంలో మోసం చేసిందనే అభిప్రాయంతో ఉన్న ఉద్యోగులను తమవైపుకు తీప్పుకునేందుకు వాగ్దానాలు చేస్తుంది. టీఆర్ యస్ అభ్యర్థులు ఓడిపోతేనే పీఆర్సీ వస్తుందని ప్రచారం చేస్తుంది. నిరుద్యోగుల విషయంలోనూ ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిందని , నిరోద్యోగ భృతి ఇస్తామని చెప్పి మాట తప్పినందున టీఆర్ యస్ అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపు నిచ్చింది. వామపక్షాల అభ్యర్థిగా జయసారథిరెడ్డి పోటీలో ఉన్నారు. ఆయన ఉభయ కమ్మ్యూనిస్టు పార్టీలు బలపరచడం వారికీ ఉపాధ్యాయులలో పట్టు ఉండటంతో ఘనమీయమైన ఓట్లు సాధించాలని పట్టుదలతో ఉంది. భారీ జన సమీకరణలో నామినేషన్ వేశారు. దీనికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, తమ్మినేని వీరభద్రం , సిపిఐ జిల్లా కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఎమ్మెల్సీ అలుగువెళ్లి నర్సిరెడ్డి లు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్న కోదండరాం న్యూ డెమోక్రసీ మడ్డతో పోటీ చేస్తున్నారు. ఆయనకు బలమైన క్యాడర్ సపోర్ట్ ఉంది. జేఏసీ చైర్మన్ గా తెలంగాణ ప్రజానీకంలో గౌరవం ఉంది. అధికార పార్టీలో ఉన్న అనేక మంది నేతలు ఆయనపట్ల అనుకూంగానే ఉంటారనే అభిప్రాయాలూ ఉన్నాయి. అందువల్ల ఆయన గట్టి అభ్యర్థిగానే ఉంటారని భావిస్తున్నారు. డాక్టర్ చెరుకు సుధాకర్ , తీన్మార్ మల్లన్న , రాణి రుద్రమ , మరికొందరు పోటీలో ఉన్నారు. అయితే వీరి పోటీ ఎలా ఉంటుంది. ఎవరి అవకాశాలను దెబ్బకొడతారనే విషయాలపై ఆశక్తి నెలకొన్నది.

Related posts

అమెరికాలో ఎన్టీఆర్ విగ్ర‌హంపై హెలికాప్ట‌ర్ నుంచి పూలవ‌ర్షం..

Drukpadam

వారిది పార్టీని చీల్చే య‌త్న‌మే!.. అసంతృప్త నేత‌ల భేటీపై ఖ‌ర్గే!

Drukpadam

కేటీఆర్… ఇలా చెప్పుకోవడానికి సిగ్గుగా అనిపించడంలేదా?: రేవంత్ రెడ్డి…

Drukpadam

Leave a Comment