Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వైరా గురుకుల పాఠశాలలో 13 మంది విద్యార్థులకు కరోనా!

గురుకుల పాఠశాలలో కరోనా కలకలం..

8 తరగతి చదువుతున్న 13 మంది విద్యార్థులకు కరోన పాజిటివ్..దీంతో జిల్లా వైద్యఆరోగ్య శాఖ పరుగులు పెట్టింది.

పాఠశాలలో విద్యార్థులు అందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది..

పేరెంట్స్ లో టెన్షన్.. టెన్షన్..

ఖమ్మం జిల్లా వైరా లో గురుకుల పాఠశాలలో 13 మంది విద్యార్థులకు కరోన సోకడం ఆందోళన కలిగిస్తోంది.

కేసులు తగ్గుతున్నాయనుకున్నా.. సమయంలోనే మళ్లీ పెరుగుతున్నాయి. కరోన కేసులు మళ్ళీ నమోదు కావడంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది.

తెలంగాణా రాష్ట్ర గురుకుల విద్యాలయంలో విద్యార్థులు 2 రోజులుగా కరోన వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు. దీనిని గుర్తించిన పాఠశాల ప్రిన్సిపాల్ కొంతమంది విద్యార్థులకు కరోన పరీక్షలు చేయించారు. వారికి 13 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ గా నిర్దారణైది. వెంటనే విద్యార్థులను ప్రత్యేక గదులకు తరలించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

గురుకులం లోని అందరి విద్యార్థులకు వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా సోకిందని సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురై గురుకుల పాఠశాలకు చేరుకుంటున్నారు…

Related posts

మ‌రో 111 పార్టీల గుర్తింపు ర‌ద్దు… రీజ‌నిదేనంటూ ఈసీ ప్ర‌క‌ట‌న‌!

Drukpadam

రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసన వ్యవస్థకు లేదనడం దాన్ని అవమానపరచడమే !

Drukpadam

ఢిల్లీ బ‌య‌లుదేరిన‌ తెలంగాణ మంత్రుల బృందం

Drukpadam

Leave a Comment