Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి భక్తులకు టీటీడీ అద్భుతమైన అవకాశం.. వర్షాల కారణంగా దర్శనం చేసుకోలేని వారి కోసం..

రాయలసీమలో కురిసిన భారీ వర్షాలకు నాలుగు జిల్లాలు అతలాకుతలమైన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆధ్యాత్మిక నగరం తిరుపతి, తిరుమలలో వర్షం బీభత్సం సృష్టించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా…

రాయలసీమలో కురిసిన భారీ వర్షాలకు నాలుగు జిల్లాలు అతలాకుతలమైన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆధ్యాత్మిక నగరం తిరుపతి, తిరుమలలో వర్షం బీభత్సం సృష్టించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలకు తిరుపతి పట్టణంతో పాటు తిరుమల గిరులు అతాలకుతలమయ్యాయి. కొండ చరియలు విరిగి పడడం, నడక దారి మొత్తం రాళ్లతో నిండిపోయాయి. ఇక కొండ మీదున్న ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. ఈ భారీ వర్షాల కారణంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కొందరు టికెట్లు ఉన్నా దర్శనం చేసుకోలేని పరిస్థితి వచ్చింది.

ఈ నేపథ్యంలో భక్తుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న టీటీడీ శుభవార్తను తెలిపింది. వర్షాల కారణంగా తిరుమలకు రాలేని భక్తుల ప్రత్యేక సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు టికెట్లు కలిగిన భక్తులు దర్శన తేదీ మార్చుకునే వెసులు బాటు కల్పించారు. ఇందుకోసం భక్తులు టీటీడీ వెబ్‌సైట్‌లో దర్శన తేదీ మార్చుకోవచ్చు. దర్శన టికెట్లు నంబరు నమోదు చేసి నూతన టికెట్లును పొందే అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా ఆరు నెలల లోపు ఏప్పుడైనా దర్శనం టికెట్ల నంబరుతో కొత్త టికెట్టు పొందే వీలును కల్పించారు.

Related posts

సీఎం కేసీఆర్ ను కలిసిన ఎమ్మెల్సీ విజేత పల్లా రాజేశ్వర్ రెడ్డి

Drukpadam

రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన హైకోర్టు…

Drukpadam

అజయ్ కు బీసీ సంఘాల తరపున గాయత్రి రవి మద్దతు!

Drukpadam

Leave a Comment