ఖమ్మం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాయల నాగేశ్వరరావు పేరు ఖరారు..
-కాంగ్రెస్ అధిష్టానం ఆమోదం మేరకు అధికారికంగా ప్రకటించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..
-నేడు నామినేషన్ దాఖలు కు భారీగా ఏర్పాట్లు…పాల్గొననున్న ముఖ్య నేతలు
ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ కాంగ్రెస్ నాయకులూ ప్రముఖ గ్రానైట్ సంస్థ అధినేత రాయల నాగేశ్వర్ రావు పేరును టీపీసీసీ అధికారికంగా ప్రకటించింది . ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన నాగేశ్వర్ రావు వామపక్ష కుటుంబం నుంచి వచ్చారు. చాల సంత్సరాలు సిపిఎం లో పని చేసిన నాగేశ్వర్ రావు తరువాత ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో పోటీచేశారు. తరువాత ప్రజారాజ్యం పార్టీ రద్దు కావడం చిరంజీవి తోపాటు అనేకమంది నేతలు కాంగ్రెస్ లో చేరారు . నాగేశ్వర్ రావు కూడా కాంగ్రెస్ లో చేరారు . తరువాత కాంగ్రెస్ కు లాయల్ గా ఉంటున్నారు . రేణుక చౌదరి కు దగ్గరగా ఉంటున్నప్పటికీ మల్లు భట్టి విక్రమార్క తో కూడా మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గంలో ఆయన గెలుపు కీలకంగా వ్యవహరించారు. సౌమ్యుడుగా ఆయనకు పేరుంది. అయితే ఉమ్మడి జిల్లాలో టీఆర్ యస్ కు స్థానికి సంస్థల్లో ఓటింగు బలంగా ఉంది. కాంగ్రెస్ గెలవంటే భారీగా క్రాస్ ఓటింగ్ జరిగితే తప్ప సాధ్యంకాదు . మిగతా పార్టీలు ఉన్నప్పటికీ వారికీ ఓట్లు పరిమిత సంఖ్యలో ఉన్నాయి. టీఆర్ యస్ అభ్యర్థి ఓడిపోవడం అంటే ఒక అద్భుతం జరిగితే తప్ప సాధ్యం కాదు …