Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

చిరుతను మట్టు బెట్టిన సహసవీరుడు

బహుశ ప్రపంచ చరిత్రలో అనేక సహసాలను గురించి విన్నాం.సినిమాలలో కూడ హీరో పులులపై దాడి చేసి వదించిన సన్నివేశాలు చూసి సంబరపడ్డాం . చప్పట్లు కొట్టాం.వారి కటౌట్లకు దండలు వేసి దండం పెడుతున్నాం.వారికి పద్మశ్రీ,పద్మభూషణ్ లు ఇస్తున్నాం. ఈ రియల్ హీరో కి మనపాలకులు ఎలాంటి బిరుదు ఇచ్చి సత్కారం చేస్తారో చూద్దాం. తన కుటుంబాన్ని కాపాడుకొనే ప్రయత్నంలో ఓ వ్యక్తి అతిపెద్ద సాహసం చేశాడు. తన వాళ్లని రక్షించుకొనేందుకు చిరుతతోనే తలపడ్డాడు. శక్తినంతా కూడదీసుకొని భీకరపోరు సాగించాడు. చిరుతపులి తీవ్రంగా గాయపరిచినా ప్రాణాలకు తెగించి ఎదురొడ్డాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ మృగాన్ని సంహరించాడు. కర్ణాటకలోని హాసన జిల్లా అరసికెరె తాలూకా బైరగొండనహళ్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుడైన రాజగోపాల్‌ సోమవారం సాయంత్రం ద్విచక్రవాహనంపై భార్య, కుమార్తెతో కలిసి బైరగొండనహళ్లి కొండ ప్రాంతంలో వెళ్తుండగా చిరుత అడ్డొచ్చింది. దాన్ని చూసి అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడంతో వాహనం నుంచి భార్య, కుమార్తె కిందపడ్డారు. అదే సమయంలో చిరుత వారిపై దాడిచేసింది. ఏమాత్రం ఆలస్యం చేసినా ప్రాణాలు కోల్పోవడం ఖాయమని భావించిన రాజగోపాల్‌..వెంటనే మృగంతో తలపడ్డాడు. చేతికి అందిన కర్రతో చితకబాదాడు. అది కూడా ఎదురుదాడి చేసి.. రాజగోపాల్‌ తల భాగాన్ని తీవ్రంగా గాయపరిచినా వెనుకంజ వేయలేదు. చివరికి చిరుతను హతమార్చడంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఇదే చిరుత సోమవారం ఉదయం ఆ ప్రాంతంలో ఇద్దరిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచిందని గ్రామస్థులు తెలిపారు. కుటుంబం కోసం చిరుతతో పోరాడిన రాజగోపాల్‌ నిజమైన హీరో అంటూ స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. రాజగోపాల్‌ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Related posts

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భార్య అమృతకూ వై ప్లస్ భద్రత!

Drukpadam

Drukpadam

ప్రపంచ టాప్ 20 మహిళా ధనవంతులు వీరే!

Drukpadam

Leave a Comment